తమిళ థ్రిల్లర్ మూవీ.. స్కూల్లోనే స్టూడెంట్ హత్య.. హంతకుడిని పట్టించే స్టూడెంట్స్.. తెలుగులోనూ యూట్యూబ్‌లో ఫ్రీగా..-tamil thriller movie pencil free streaming in telugu on youtube murder mystery movie pencil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తమిళ థ్రిల్లర్ మూవీ.. స్కూల్లోనే స్టూడెంట్ హత్య.. హంతకుడిని పట్టించే స్టూడెంట్స్.. తెలుగులోనూ యూట్యూబ్‌లో ఫ్రీగా..

తమిళ థ్రిల్లర్ మూవీ.. స్కూల్లోనే స్టూడెంట్ హత్య.. హంతకుడిని పట్టించే స్టూడెంట్స్.. తెలుగులోనూ యూట్యూబ్‌లో ఫ్రీగా..

Hari Prasad S HT Telugu

తమిళ థ్రిల్లర్ మూవీ ఒకటి యూట్యూబ్ లో తెలుగులోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ స్కూల్లో జరిగే స్టూడెంట్ హత్య, దాని చుట్టూ అందులోని ఇద్దరు స్టూడెంట్సే సాగించే ఇన్వెస్టిగేషన్ తో సాగిపోయే మూవీ ఇది. మరీ అంత థ్రిల్ ఏమీ ఉండదు కానీ.. ఓసారి చూసేయొచ్చు.

తమిళ థ్రిల్లర్ మూవీ.. స్కూల్లోనే స్టూడెంట్ హత్య.. హంతకుడిని పట్టించే స్టూడెంట్స్.. తెలుగులోనూ యూట్యూబ్‌లో ఫ్రీగా..

తమిళ థ్రిల్లర్ మూవీ పెన్సిల్ (Pencil). ఇది 2016లోనే వచ్చిన సినిమా. జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్లో నటించాడు. ఈ మూవీ ఆ తర్వాత తెలుగులోనూ డబ్ అయింది. యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ మర్డర్ మిస్టరీ మూవీ. సాధారణంగా ఇలాంటి వాటిలో ఉండాల్సినంత థ్రిల్, ట్విస్టులు ఉండవు కానీ చివరి వరకూ హంతకుడెవరన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది.

పెన్సిల్ మూవీ స్టోరీ ఇదీ..

పెన్సిల్ మూవీ మొత్తం స్కూల్లోనే పట్టపగలు జరిగే ఓ స్టూడెంట్ హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ చనిపోయిన స్టూడెంట్ కూడా ఆ రాష్ట్రంలోని ఓ స్టార్ హీరో కొడుకు కావడం విశేషం. అయితే అలాంటి వ్యక్తి హత్యకు గురైన తర్వాత సాధారణంగా ఉండే హడావిడి ఇందులో ఉండదు. అసలు పోలీసులు కూడా రంగంలోకి దిగకముందే ఇద్దరు స్టూడెంట్సే హత్య చేసిందెవరో కనిపెట్టేస్తారు.

2016లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ముఖ్య పాత్రలైన శివ (జీవీ ప్రకాశ్ కుమార్), మాయ (శ్రీ దివ్య), నితిన్ (షరీక్ హసన్)లే సినిమాలో కనిపిస్తూ ఉంటారు. వీళ్లలో నితిన్ ఓ స్టార్ హీరో కొడుకు. సినిమా మొదట్లోనే అతన్ని క్లాస్ రూమ్ లోనే ఎవరో పెన్సిల్ తో హత్య చేసినట్లుగా చూపిస్తారు. ఆ తర్వాత మిగిలిన రెండు పాత్రలు శివ, మాయ.. ఆ హత్య కేసును ఎలా ఛేదించారన్నదే మిగిలిన కథ.

పెన్సిల్.. థ్రిల్ లేని మర్డర్ మిస్టరీ

మర్డర్ మిస్టరీ సినిమాలంటే మంచి సస్పెన్స్, థ్రిల్ పంచాలి. అందులోనూ ఓ స్కూల్లోనే ఓ స్టూడెంట్ ను పట్టపగలు చంపడం అనే స్టోరీని మరింత గ్రిప్పింగా తెరకెక్కించాలి. కానీ పెన్సిల్ మూవీలో అలాంటి థ్రిల్ ఏమీ కనిపించదు. పెద్దగా లాజిక్‌లు లేకుండా సాగిపోతుంది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండే శివ, పోలీస్ కమిషనర్ కూతురు అయిన మాయ ఎవరి సాయం లేకుండానే సింపుల్ గా ఈ మర్డర్ మిస్టరీని ఛేదిస్తారు.

సినిమా మొదట్లోనే ఈ హత్యను చూపించగా.. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం నితిన్ కు ఉన్న శత్రువులను చూపిస్తారు. వీళ్లలో ఎవరు అతన్ని హత్య చేశారో అన్న సస్పెన్స్ మధ్య ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ లో శివ, మాయ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ క్రమంలో నితిన్ శత్రువులు, అనుమానితులందరూ ఆ సమయంలో స్కూల్లోనే ఉండటంతో వాళ్లలో ఎవరు చేశారో అన్న సస్పెన్స్ మాత్రం చివరి వరకూ కొనసాగుతుంది. ఇదొక్కటే ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్. మిగిలిన స్టోరీ అంతా పెద్దగా లాజిక్ లేకుండా ఏదో అలా సాగిపోతుంది.

మణి నాగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఐఎండీబీలోనూ 5.7 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఎప్పుడైనా ఏదైనా మర్డర్ మిస్టరీ సినిమా చూడాలనుకుంటే, అది కూడా తెలుగులో కావాలంటే యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం