తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కాము కాపి ఓటీటీలోకి వచ్చేస్తోంది. సింప్లీ సౌత్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇండియన్ ఆడియెన్స్‌కు మాత్రం ఈ ఓటీటీలో సినిమాను చూడలేరు. ఇదొక ఓవర్‌సీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావడం గమనార్హం. త్వరలోనే టెంట్ కోట లేదా అమెజాన్ ప్రైమ్‌లలో ఓ ఓటీటీ ద్వారా కాము కాపి ఇండియన్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాము కాపి మూవీలో విఘ్నేష్ రవి, త్రిచీ శ్రవణ్ కుమార్, శరణ్య రవిచంద్రన్, ప్రియదర్శిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పుష్పనాథన్ ఆర్ముగం దర్శకత్వం వహించాడు. వెరైటీ టైటిల్‌తో తమిళ ఆడియెన్స్‌లో ఈ మూవీ ఆసక్తిని రేకెత్తించింది. కానీ టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో కనిపించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అన్బు, అను ఒకే కాలేజీలో చదువుతారు. ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లిచేసుకుంటారు. అన్బు సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. కానీ సక్సెస్ కాలేకపోతాడు. ఈ విషయంలోనే అన్బు, అను మధ్య గొడవలు మొదలవుతాయి. అదే టైమ్‌లో దీపక్ అనే యువకుడు వారి జీవితాల్లోకి వస్తాడు. హంతకుడిగా దీపక్‌పై ఆరోపణలు రావడానికి కారణం ఏమిటి? అన్బు, అను విడిపోయారా? నిజానికి, లక్ష్యానికి మధ్య నలిగిపోయిన ఈ ముగ్గురు జీవితాలు విధి కారణంగా ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ఈ మూవీ కథ.
ఈ వారం ఓటీటీలోకి కా ము కా పితో పాటు నేసిప్పియా మూవీ కూడా ఓటీటీలోకి రాబోతోంది. సన్ నెక్స్ట్‌తో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇటీవల రిలీజైన తమిళ సినిమాలు ఈఎమ్ఐ, టెన్ అవర్స్ ఓటీటీలోనూ అదరగొడుతోన్నాయి. టెన్స్ అవర్స్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈఎమ్ఐ టెంట్‌కోటతో పాటు ఆహా తమిళ్ ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాలు ఓటీటీలో మాత్రం రికార్డ్ వ్యూస్‌ను రాబడుతోన్నాయి.
సంబంధిత కథనం