OTT Tamil Romantic Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న నిత్య మేనన్ సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?-tamil romantic movie kadhalikka neramillai ott release date nitya menon movie may stream on netflix from 14th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Romantic Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న నిత్య మేనన్ సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

OTT Tamil Romantic Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న నిత్య మేనన్ సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Hari Prasad S HT Telugu
Feb 03, 2025 04:20 PM IST

OTT Tamil Romantic Movie: ఓటీటీలోకి ఇప్పుడో సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ డ్రామా రాబోతోంది. ప్రముఖ నటి నిత్య మేనన్ నటించిన ఈ మూవీ గత నెల 14న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న నిత్య మేనన్ సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఓటీటీలోకి వచ్చేస్తున్న నిత్య మేనన్ సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

OTT Tamil Romantic Movie: తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పేరు కాదలిక్క నేరమిళ్లై (Kadhalikka Neramillai). అంటే ప్రేమించడానికి సమయం లేదు అని. నిత్య మేనన్ నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.16.5 కోట్లు వసూలు చేసి మంచి విజయం సాధించింది.

కాదలిక్క నేరమిళ్లై ఓటీటీ రిలీజ్ డేట్

తమిళంలో గత నెల రిలీజై సూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు టైమ్స్ నౌ రిపోర్టు వెల్లడించింది.

సుమారు రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.16.5 కోట్లు వచ్చాయి. రవి మోహన్, నిత్య మేనన్ జంటగా నటించిన మూవీ ఇది. కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేశారు. థియేటర్లలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 2010లో వచ్చిన అమెరికన్ మూవీ ది స్విచ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

కాదలిక్క నేరమిళ్లై మూవీ గురించి..

కాదలిక్క నేరమిళ్లై మూవీ స్టోరీ కాస్త భిన్నమైనదే. ఈ సినిమాలో శ్రేయ అనే పాత్రలో నిత్య, సిద్ధార్థ్ అనే పాత్ర రవి మోహన్ నటించారు. శ్రేయ ఓ ఆర్కిటెక్ట్. ఆమె కరణ్ అనే ఓ అబ్బాయిని ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంది. అయితే అతని వల్ల పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో విడాకులు ఇచ్చేసి ఐవీఎఫ్ ద్వారా తల్లి కావడానికి ప్రయత్నిస్తుంది.

ఆమె పీ.జేమ్స్ అనే మారుపేరు ద్వారా సిద్ధార్థ్ ఇచ్చిన వీర్యంతోనే తల్లి అవుతుంది. అయితే తనకు వీర్యదానం చేసిన అతని గురించి తెలుసుకోవడానికి శ్రేయ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అయితే మారుపేరు, తప్పుడు చిరునామా ఉండటంతో అతన్ని కనిపెట్టలేకపోతుంది. ఆలోపు ఆమె పార్థివ్ అనే బాబుకు జన్మనిస్తుంది. 8 ఏళ్ల తర్వాత చెన్నై వెళ్లిన సిద్ధార్థ్.. అనుకోకుండా శ్రేయ, పార్థివ్ లను కలుస్తాడు.

అతడికి తానే తండ్రి అనే విషయం సిద్ధార్థ్ కు తెలియకపోయినా ఆ ఇద్దరి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీ కథ. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన మూవీ కాదలిక్క నేరుమిళ్లై ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం