OTT Romantic Comedy: తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ స్వీట్ హార్ట్. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. బాయ్‌ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసిన అమ్మాయి ఏం చేసిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ స్వీట్ హార్ట్ శుక్రవారం (ఏప్రిల్ 11) ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
మార్చి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చారు.
స్వీట్ హార్ట్ మూవీని స్వినీత్ ఎస్ సుకుమార్ డైరెక్ట్ చేశాడు. ఇందులో రియో రాజ్, గోపికా రమేష్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ వాసు (రియో రాజ్), మను (గోపికా) అనే జంట చుట్టూ తిరిగే కథ. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఇద్దరి అభిప్రాయాలు మాత్రం వేరుగా ఉంటాయి.
దీంతో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో ఈ ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో మను ఫ్యామిలీ వాళ్లను చూస్తుంది. దీంతో ఆమెను ఇంట్లో నుంచి కదలకుండా చేస్తారు. కానీ అప్పుడే ఆమెకు తాను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ విషయం చెప్పడానికే వాసుకి ఫోన్ చేస్తుంది.
ఆ ఫోన్ కాల్ సినిమాను మరో మలుపు తిప్పుతుంది. తర్వాత ఏం జరగుతుంది? ఈ ఇద్దరూ కలుస్తారా? లేక మరింత దూరమవుతారా అన్నది ఈ స్వీట్ హార్ట్ మూవీలో చూడొచ్చు. ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో రిలీజైన తర్వాత మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. లీడ్ రోల్స్ లో నటించిన రియో రాజ్, గోపికల నటనకు మంచి మార్కులు పడినా.. ఓవరాల్ గా సినిమాకు మాత్రం నెగటివ్ కామెంట్సే ఎక్కువగా వచ్చాయి.
సంబంధిత కథనం