OTT Movie: ఓటీటీలోకి తమిళ ఫీల్ గుడ్ కామెడీ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-tamil romantic comedy movie konjam pesinaal yenna ott streaming from august 16 on aha tamil platform ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: ఓటీటీలోకి తమిళ ఫీల్ గుడ్ కామెడీ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Movie: ఓటీటీలోకి తమిళ ఫీల్ గుడ్ కామెడీ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 13, 2024 03:26 PM IST

Konjam Pesinaal Yenna OTT Release: తమిళ మూవీ ‘కొంజమ్ పెసినాల్ ఎన్న’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 80 రోజుల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే.d

OTT Movie: ఓటీటీలోకి తమిళ ఫీల్ గుడ్ కామెడీ రొమాంటికి మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Movie: ఓటీటీలోకి తమిళ ఫీల్ గుడ్ కామెడీ రొమాంటికి మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

యంగ్ యాక్టర్లు వినోత్ కిషన్, కీర్తి పాండియన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కొంజమ్ పెసినాల్ ఎన్న’ సినిమా మే 23వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ తమిళంతో వచ్చింది. దర్శకుడు గిరి మర్ఫీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ లవ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘కొంజమ్ పెసినాల్ ఎన్న’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఓటీటీ రిలీజ్ డేట్

‘కొంజమ్ పెసినాల్ ఎన్న’ సినిమా ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు (ఆగస్టు 13) అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీని తెలుగు ప్లాట్‍ఫామ్‍లోకి తెచ్చే విషయంపై ఆహా క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్టు 16న ఆహా తమిళ్‍లో కొంజమ్ పెసినాల్ ఎన్న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

కొంజమ్ పెసినాల్ ఎన్న మూవీలో వినోత్ కిషన్, కీర్తితో పాటు కామ్నా బాత్రా, వీజే ఆషిక్, గౌతమ్ సౌందరరాజన్, ఆకాశ్ ప్రేమకుమార్, షారాయ్ బెన్నీ, దరణి రెడ్డి కీలకపాత్రలు పోషించారు. చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఇద్దరు ప్రేమికుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి గిరి మర్ఫీ దర్శకత్వం వహించారు.

ఆలస్యంగా..

కొంజమ్ పెసినాల్ ఎన్న మూవీ షూటింగ్ 2021లోనే మొదలైంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నెమ్మదిగా సాగాయి. అయితే, ఎట్టకేలకు ఈ ఏడాది మే 23వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఆ తర్వాత సుమారు 80 రోజుల తర్వాత ఆహా తమిళ్‍లో ఈ మూవీ ఆగస్టు 16న స్ట్రీమింగ్‍కు రానుంది.

కొంజమ్ పెసినాల్ ఎన్న చిత్రాన్ని సమీర్ భరత్ రామ్ నిర్మించగా.. దీపన్ చక్రవర్తి సంగీతం అందించారు. లెనిన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీకి ఎక్కువగా మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో పెద్దగా కలెక్షన్లు రాలేదు.

కొంజమ్ పెసినాల్ ఎన్న స్టోరీలైన్

చిన్నతనం నుంచే ప్రేమలో ఉన్న ఇద్దరు లవర్స్ చుట్టూ కొంజమ్ పెసినాల్ ఎన్న స్టోరీ సాగుతుంది. అజయ్ (వినోత్)ను చిన్నప్పటి నుంచే సంజన (కీర్తి) ఇష్టపడుతుంది. స్కూల్ రోజుల్లోనే ఒకరంటే ఒకరు ఇష్టపడుతుంటారు. అయితే, ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో దూరమవుతారు. కొన్నేళ్ల తర్వాత అజయ్, కీర్తి మళ్లీ సోషల్ మీడియాలో కలుస్తారు. కరోనా ప్రభావం ఉండటంతో నేరుగా కలవలేకపోవటంతో ఫోన్ కాల్స్, సోషల్ మీడియాలో మెసేజ్‍లు, వీడియో కాల్స్‌లోనే మాట్లాడుకుంటారు. అలాగే వారి మధ్య ప్రేమ బలపడుతుంది. అయితే, కొన్నిరోజులకు ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వస్తాయి. తరచూ గొడవ పడుతుంటారు. ఒకరి ఎమోషన్స్ ఒకరు స్పష్టంగా చెప్పుకోలేకపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి మధ్య విభేదాలు సద్దుమణిగాయా? ఒక్కటయ్యారా? అనే విషయాలు ఈ మూవీ కథలో ప్రధానంగా ఉంటాయి.

కొంజమ్ పెసినాల్ ఎన్న మూవీలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉన్నా.. నరేషన్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వచ్చింది. కథనం మెరుగ్గా ఉండాల్సిందన్న రెస్పాన్స్ వచ్చింది.

Whats_app_banner