Romantic Comedy OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హీరోయిన్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ
Romantic Comedy OTT: కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎనక్కు తొలిళ్ రొమాన్స్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి టెంట్‌కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ సినిమాలో అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా హీరోహీరోయిన్లుగా నటించారు.
Romantic Comedy OTT: తెలుగు హీరోయిన్ అవంతిక మిశ్రా తమిళ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎనక్కు తొళిల్ రొమాన్స్ శుక్రవారం టెంట్‌కోట ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా మేకర్స్ ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు. రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అశోక్ సెల్వన్ హీరోగా నటించాడు. ఎమ్.ఎస్ భాస్కర్, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. బాలజీ కేశవన్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

2017లోనే షూటింగ్ కంప్లీట్...
గత ఏడాది నవంబర్‌లో ఎనక్కు తొళిల్ రొమాన్స్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా షూటింగ్ 2017లోనే పూర్తయింది. ఆర్థిక పరమైన సమస్యల వల్ల ఎనక్కు తొలిళ్ రిలీజ్‌కు నోచుకోలేదు. ఆ అడ్డంకులన్నీ దాటుకొని దాదాపు ఏడేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హీరో అశోక్ సెల్వన్ దూరంగా ఉండటం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఆడియో లాంఛ్‌తో పాటు పలు ఈవెంట్స్‌లో అశోక్ సెల్వన్‌పై దర్శకనిర్మాతలు విమర్శలు గుప్పించారు.
కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్...
ఎనక్కు తొళిల్ రొమాన్స్ థియేటర్లలో డిజాస్టర్‌గా మిగిలింది. అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా కెమిస్ట్రీ బాగున్నా కాన్సెప్ట్, కామెడీ ఔట్‌డేటెడ్ కావడంతో ఈసినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
భిన్న మనస్తత్వాలు కలిగిన జంట...
ఉమా శంకర్ (అశోక్ సెల్వన్) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. పెద్దగా ఆదాయం లేకపోయినా జాలీగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. లియో (అవంతిక మిశ్రా) నర్స్‌గా పనిచేస్తుంటుంది. జీవితం పట్ల ఉన్నతమైన ఆశయాలతో బతుకుతుంటుంది.
ఉద్యోగం నిమిత్తం చెన్నై నుంచి ఢిల్లీ షిఫ్ట్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటుంది. లియోను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు ఉమా శంకర్. ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? వారి మధ్య అపోహలు, అపార్థాలకు కారణమేమిటి? చివరకు వారు ఎలా కలుసుకున్నారనే అంశాలను ఫన్, ఎమోషన్స్‌తో దర్శకుడు ఈ మూవీలో చూపించాడు.
తెలుగులో హీరోయిన్‌గా...
హీరోయిన్‌గా అవంతిక మిత్రా సినీ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన మాయ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
వైశాఖం, మీకు మీరే మాకు మేమే సినిమాల్లో నటించింది. నితిన్ భీష్మ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. కొన్నాళ్లుగా తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. అశోక్ సెల్వన్ కూడా తెలుగులో నిన్నిలా నిన్నిలా సినిమాలో హీరోగా నటించాడు. అతడు నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.