ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 2064లో జరిగే స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్-tamil psychological thriller movie kaliyugam 2064 ott release date sun nxt ott to stream the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 2064లో జరిగే స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 2064లో జరిగే స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. 2064వ సంవత్సరంలో జరిగే కథగా వచ్చిన ఈ సినిమా పేరు కలియుగం 2064. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఓటీటీలోకి శ్రద్ధా శ్రీనాథ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. 2064లో జరిగే స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

యుగాంతం తర్వాత జరిగే కథలతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటోంది. గతేడాది తెలుగులో వచ్చిన కల్కి 2898 ఏడీ కూడా అలాంటిదే. ఇప్పుడో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కూడా ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. మే 9న థియేటర్లలో రిలీజైన కలియుగం 2064(Kaliyugam 2064) మూవీ రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

కలియుగం ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలియుగం సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది. జులై 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

“ప్రపంచం ముగిసిన తర్వాత మీరు ఏమవుతారు? నమ్మకం, భయం, సర్వైవల్ మధ్య భవిష్యత్తులో జరిగే యుద్ధం చీకటిగా మారింది. కలియుగం జులై 11 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ పోస్టులో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా షేర్ చేసింది.

కలియుగం మూవీ గురించి..

కలియుగం మూవీని ప్రమోద్ సుందర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు కథ కూడా అతడే అందించాడు. కిశోర్, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి వాళ్లు నటించారు. మే 9న థియేటర్లలో రిలీజైంది. తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా రిలీజైంది. మానవాళి దాదాపు తుడిచిపెట్టుకుపోయిన తర్వాత 2064లో మిగిలిన కొందరు నీళ్లు, ఆహారంతోపాటు మనుగడ సాగించడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సినిమా ప్రధానంగా లీడ్ రోల్స్ కిశోర్, శ్రద్ధా శ్రీనాథ్ చుట్టే తిరుగుతుంది.

ఈ సినిమాకు ఐఎండీబీలో 6.2 రేటింగ్ నమోదైంది. పరిమిత పాత్రలు, చిన్నపాటి సెట్టింగ్‌తోనే ఈ సినిమాలో చాలా అంశాలను చూపించే ప్రయత్నం చేశారు. అయితే, కథనం సాగే వేగానికి అనుగుణంగా సినిమా కొన్ని చోట్ల సాగతీతగా, అనవసరమైన అంశాలతో కూడుకొని ఉందని చెప్పాలి. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని కలియుగం సినిమాకు సన్ నెక్ట్స్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం