Blue Star OTT: ఏకంగా 3 ఓటీటీల్లోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ బ్లూ స్టార్.. తెలుగులోనూ స్ట్రీమింగ్?
Blue Star OTT Streaming: తమిళ సినీ ఇండస్ట్రీలోని సినిమాలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆ చిత్రాలను వదిలిపెట్టకుండా చూస్తారు మూవీ లవర్స్. తాజాగా తమిళంలో హిట్ అయిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ బ్లూ స్టార్ ఏకంగా మూడు ఓటీటీల్లోకి రానుంది.
Blue Star OTT Release: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తెరకెక్కించడంలో మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమ ముందంజలో ఉంటుందని చెప్పుకోవచ్చు. విభిన్నమైన కాన్సెప్టుతో సీడ్ ఎడ్జ్‌లో కూర్చెబెట్టే కథనంతో ఈ థ్రిల్లర్ మూవీస్ సాగుతుంటాయి. ఎన్ని జోనర్స్ ఉన్నప్పటికీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ స్పెషల్‌గా ఉంటాయి. ఆద్యంతం ఆకట్టుకునే కథనంతో ట్విస్టులు ఇస్తూ సాగే మూవీని ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.
ఇక ఓటీటీలు వచ్చాక వాటి హవా మరింతగా పెరిగింది. అందుకే తమిళ, మలయాళం ఇలా ఇతర పరిశ్రమలకు చెందిన సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. ఇక తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌కు తెలుగులో మంచి పేరు ఉంది. అందుకే ఆ సినీ పరిశ్రమలో విడుదలయ్యే దాదాపు చాలా సినిమాలను ఓటీటీలో అందరికీ అందుబాటులో ఉండే భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుంటారు. తాజాగా మరొ తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఏకంగా మూడు ఓటీటీలోకి రానుంది.
తమిళంలో ఇటీవల మంచి హిట్ కొట్టిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ బ్లూ స్టార్. ఈ సినిమా రాజకీయా అంశాలతోపాటు క్రికెట్ గేమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. క్రికెట్‌తోపాటు కులాల మధ్య ఉండే అంతరాలను చూపించిన బ్లూ స్టార్ సినిమా తమిళంలో జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న అశోక్ సెల్వన్ హీరోగా నటించాడు. అతనికి జోడీగా కీర్తి పాండియన్ నటించింది.
అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ గతేడాది సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. దాంతో భార్యాభర్తలుగా మారిన తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమాగా బ్లూ స్టార్ అయింది. ఈ సినిమాలో వీరిద్దరితోపాటు పృథ్వీ పాండిరాజన్, లిజీ ఆంటోనీ, శంతను భాగ్యరాజ్, అరుణ్ బాలాజీ, ఎలాంగో కుమారవేల్, భాగవతి పెరుమై తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన బ్లూ స్టార్ సినిమాకు ఎస్. జయ కుమార్ దర్శకత్వం వహించారు.
బ్లూ స్టార్ చిత్రాన్ని లెమన్ లీఫ్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆర్. గణేణ్ మూర్తి, జీ. సౌందర్యతోపాటు నీలం ప్రొడక్షన్ పతాకంపై పా. రంజిత్ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 25న రిలీజైన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాను థియేటర్‌లలో చూసిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. తాజాగా బ్లూ స్టార్ మూవీని ఓటీటీలోకి తీసుకురానున్నారు.్ అది కూడా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో.
బ్లూ స్టార్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇదే కాకుండా టెంట్‌కొట్టా (Tentkotta OTT), సింప్లీ సౌత్ (Simply South OTT) అనే మరో రెండు తెలియని ఓటీటీల్లో కూడా బ్లూ స్టార్ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఈ రెండు ఓటీటీల్లో కూడా ఇదే ఫిబ్రవరి 29 నుంచే స్ట్రీమింగ్ కానుంది. అయితే, తమిళ సినిమా అయిన బ్లూ స్ట్రార్‌ను అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాపిక్