OTT Comedy Drama: రెండు ఓటీటీల్లోకి కామెడీ డ్రామా చిత్రం.. సింపుల్ గేమ్‍తో సీక్రెట్స్ బట్టబయలు! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-tamil ott comedy drama movie ring ring will be streaming on aha tamil and tentkotta platforms this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Drama: రెండు ఓటీటీల్లోకి కామెడీ డ్రామా చిత్రం.. సింపుల్ గేమ్‍తో సీక్రెట్స్ బట్టబయలు! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Comedy Drama: రెండు ఓటీటీల్లోకి కామెడీ డ్రామా చిత్రం.. సింపుల్ గేమ్‍తో సీక్రెట్స్ బట్టబయలు! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Comedy Drama: రింగ్ రింగ్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. రెండో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కామెడీ డ్రామా చిత్రం ఓ గేమ్ చుట్టూ సాగుతుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

OTT Comedy Drama: రెండు ఓటీటీల్లోకి రానున్న కామెడీ డ్రామా చిత్రం

డైరెక్టర్ శక్తివేల్ దర్శకత్వం వహించిన ‘రింగ్ రింగ్’ చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో ప్రవీణ్ రాజ్, వివేక్ ప్రసన్న, సాక్షి అగర్వాల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ తమిళ కామెడీ డ్రామా చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ రింగ్ రింగ్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు..

రింగ్ రింగ్ సినిమా ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే టెంట్‍కొట్ట అనే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ ఈ చిత్రం మార్చి 21న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇలా ఆహా తమిళ్, టెంట్‍కొట్ట రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.

గేమ్‍తో సీక్రెట్స్ బయటికి.. స్టోరీ ఇదే..

ఓ పుట్టిన రోజు పార్టీ కోసం చిన్ననాటి స్నేహితులంతా ఓ చోట కలుస్తారు. ఈ సెలెబ్రేషన్లలో భాగంగా రింగ్ రింగ్ అనే గేమ్ ఆడేందుకు రెడీ అవుతారు. తమకు వచ్చిన ఇన్‍కమింగ్ కాల్స్, మెసేజ్‍లను వెల్లడించడమే ఈ గేమ్. ఈ గేమ్ ఆడే కొద్దీ వారికి సంబంధించిన సీక్రెట్స్ బయటికి వస్తూనే ఉంటాయి. ఒకరి రహస్యాలు ఒకరికి తెలిసిపోతాయి. దీంతో వారి రిలేషన్లపై ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. గతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఈ గేమ్‍లో బయటికి వచ్చిన సీక్రెట్స్ ఏంటి.. వీటి వల్ల వారి మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది రింగ్ రింగ్ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

రింగ్ రింగ్ చిత్రంలో ప్రవీణ్ రాజ్, వివేక్, సాక్షి‍తో పాటు డానియెల్ అనీ పోప్ప్, స్వయం సిద్ధ, జమున ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ గేమ్ చుట్టూ కామెడీ డ్రామా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శక్తివేల్. కామెడీ బాగానే ఉన్నా.. ఈ మూవీ ఎంగేజింగ్‍గా లేదనే మిక్స్ట్ టాక్ వచ్చింది. దీంతో థియేటర్లలో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

రింగ్ రింగ్ మూవీని దియా సినీ క్రియేషన్స్, రూల్ బ్రేకర్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై జగన్ నారాయణ్, శక్తివేల్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి వసంత్ సంగీతం అందించారు. ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి పీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తమిళ కామెడీ డ్రామా చిత్రం బేబీ అండ్ బేబీ మార్చి 21వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో జై, యోగిబాబు, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం