హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‌లో నటించిన తమిళ మూవీ విసిథిరన్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మరో తెలుగు హీరోయిన్ మధుశాలిని ఓ కీలక పాత్రలో నటించింది. ఆర్‌కే సురేష్ హీరోగా నటించాడు.
జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళం మూవీ జోసెఫ్ కు రీమేక్‌గా విసిథిరన్ తెరకెక్కింది. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తమిళంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విసిథిరన్ మూవీకి తమిళ దర్శకుడు బాలా ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. పద్మకుమార్ దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. 2022లో థియేటర్లలో విసిథిరన్ మూవీ రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 6.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
మాయన్ ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తన తెలివితేటలు, ధైర్యంతో ఎన్నో క్లిష్టమైన కేసులను సాల్వ్‌చేస్తాడు. మనస్పర్థల కారణంగా భార్య స్టెల్లా నుంచి విడాకులు తీసుకుంటాడు మాయన్. ఓ రోడ్డు ప్రమాదంలో స్టెల్లా చనిపోతుంది. ఆమెది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని మాయన్ అనుమానిస్తాడు. ఇన్వేస్టిగేషన్‌లో అతడి అనుమానం నిజమేనని తేలుతుంది. అసలు స్టెల్లాను ఎవరు చంపారు? హంతకుడిని మాయన్ ఎలా కనిపెట్టాడు? మీనాక్షితో మాయన్‌కు ఉన్న సంబంధమేమిటి అన్నదే ఈ మూవీ కథ.
విసిథిరన్ మూవీలో హీరోయిన్లుగా నటించిన పూర్ణ, మధుశాలిని తెలుగులో పలు సినిమాలు చేశారు. మధుశాలిని కెరీర్ తెలుగు సినిమాలోనే మొదలవ్వడం గమనార్హం. తెలుగులో సీమటపకాయ్, అవును, మామ మంచు అల్లుడు కంచుతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది పూర్ణ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్‌లో భీమా, అఖండ, దసరాతో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో మెరిసింది.
చిరంజీవి అందరివాడు మూవీతో మధుశాలిని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ కితకితలు మూవీలో హీరోయిన్‌గా నటించింది. అనుక్షణం, గోపాలగోపాల, గూఢచారితో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది.
సంబంధిత కథనం