Tamil OTT: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు తమిళ సినిమాలు - ఒకటి మర్డర్ మిస్టరీ - మరొకటి అడ్వెంచర్ థ్రిల్లర్
Tamil OTT: తమిళ సినిమాలు రాకధన్, యోశి ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. రాకధన్ మిర్టర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కగా...యోశి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందింది.
Tamil OTT: తమిళ సినిమాలు రాకధన్, యోశి బుధవారం ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. యోశి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందగా... రాకధన్ మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కింది. . ఈ రెండు సినిమాలు 2023లో థియేటర్లలో రిలీజయ్యాయి. రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చాయి. 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
మర్డర్ మిస్టరీ మూవీ…
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన రాకధన్ మూవీలో వంశీకృష్ణ, రియాజ్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దినేష్ కలైసెల్వన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సంజనా సింగ్ హీరోయిన్‌గా నటించింది.
రాకధన్ కథ ఇదే...
అర్జున్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురువుతాడు. ఈ కేసును అజ్మల్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. అర్జున్ బాస్ అలెక్స్ హంతకుడు అని అజ్మల్ అనుమానిస్తాడు. బిజినెస్ పేరుతో అలెక్స్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని అజ్మల్ కనిపెడతాడు. కానీ ఊహించని రీతిలో ఈ హత్యకు తన ప్రియురాలికి సంబంధం ఉందనే విషయం అజ్మల్‌కు తెలుస్తుంది? ఆ తర్వాత ఏమైంది? అర్జున్‌ను హత్య చేసింది ఎవరు? ఈ నిజాన్ని ఆజ్మల్ ఎలా బయటపెట్టాడు అన్నదే ఈ మూవీ కథ.
యోశి...
తమిళ మూవీ యోశి థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. యోశి మూవీలో అభయ్ శంకర్, రేవతి వెంకట్, అర్చన గౌతమ్ హీరోహీహీరోయిన్లుగా నటించారు. ఊర్వశి కీలక పాత్ర పోషించింది. స్టీఫెన్ ఎమ్ జోసెఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
నీట్ ఎగ్జామ్స్...
మధువన్ ఓ స్టూడెంట్. నీట్ ఎగ్జామ్స్ చాలా సార్లు రాస్తాడు. కానీ ఒక్కసారి కూడా క్వాలిఫై కాలేకపోతాడు. చివరగా ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉండటంతో మానసికంగా ఒత్తిడికి లోనవుతాడు. ఎగ్జామ్స్ పాస్ కాలేననే భయంతో ఆత్మహత్య చేసుకోవాలని ఓ ఫారెస్ట్‌కు వెళతాడు. పెద్ద లోయలో పడతాడు. కానీ ప్రాణాలు మాత్రం పోవు. అడవిలో అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. సూసైడ్ చేసుకోవడానికి అడవిలోకి వెళ్లిన మధువన్...ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటం చేశాడు అన్నదే ఈ మూవీ కథ. యోశి మూవీకి రాబిన్ రాజశేఖర్ మ్యూజిక్ అందించాడు.
సంబంధిత కథనం