ఓటీటీలోకి తమిళ డిఫరెంట్ మూవీ.. పిత్తుల సౌండ్ చేసే డెడ్ బాడీ..దేవుడంటూ రెండు గ్రామాల కొట్లాట.. ఈ థ్రిల్లర్ కు 8.2 రేటింగ్-tamil movie bomb ott release date thriller will be streaming on aha tamil south simply and shortflix 8 2 imdb ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తమిళ డిఫరెంట్ మూవీ.. పిత్తుల సౌండ్ చేసే డెడ్ బాడీ..దేవుడంటూ రెండు గ్రామాల కొట్లాట.. ఈ థ్రిల్లర్ కు 8.2 రేటింగ్

ఓటీటీలోకి తమిళ డిఫరెంట్ మూవీ.. పిత్తుల సౌండ్ చేసే డెడ్ బాడీ..దేవుడంటూ రెండు గ్రామాల కొట్లాట.. ఈ థ్రిల్లర్ కు 8.2 రేటింగ్

ఓటీటీలోకి ఓ డిఫరెంట్ తమిళ మూవీ వచ్చేస్తోంది. చనిపోయిన వ్యక్తి పిత్తుల సౌండ్ చేస్తున్నాడని దేవుడిగా కొలుస్తారు. ఆ వ్యక్తి కోసం రెండు గ్రామాలు కొట్టుకుంటాయి. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్.

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (youtube)

ఓటీటీలోకి తమిళ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వచ్చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ సినిమానే ‘బాంబ్’. థియేటర్లలో పాజటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు 8.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు మూవీ రెడీ అయింది.

బాంబ్ ఓటీటీ

లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘బాంబ్’ ఓటీటీలోకి రాబోతుంది. ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 10 నుంచి ఆహా తమిళ్ తో పాటు సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో బాంబ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఒకే సారి మూడు ఓటీటీల్లో రిలీజ్ అవుతుంది.

నెల రోజుల్లోనే ఓటీటీలో

బాంబ్ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజైంది. విశాల్ వెంకట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సుధా సుకుమార్, సుకుమార్ బాలక్రిష్ణన్ నిర్మించారు. ఇప్పుడీ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది.

డిఫరెంట్ జోనర్

బాంబ్ సినిమా డిఫరెంజ్ జోనర్ లో తెరకెక్కింది. మ్యాజికల్ రియలిజమ్ జోనర్ లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంటే మ్యాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన రియల్ వరల్డ్ లో జరిగే స్టోరీ ఇది. ఇందులో ఏది ఫిక్షన్, ఏది రియల్ అని కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాలో కాళీ వెంకట్ కీలక పాత్ర పోషించాడు.

బాంబ్ కథ

బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్. కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు గ్రామాలుగా కాలకమ్మైపట్టి ఊరు విడిపోతుంది. దేవుణ్ని నమ్మని కతిరావన్ (కాళీ వెంకట్) సడెన్ గా చనిపోతాడు. అతణ్ని రెండు గ్రామాల మధ్యలోని చెట్టు దగ్గర కుర్చీలో కూర్చోబెడతాడు. కానీ మణిముత్తు (అర్జున్ దాస్) మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు.

కతిరావన్ బాడీని రెడీ చేస్తున్న సమయంలో పిత్తుల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. దీంతో కతిరావన్ ను దేవుడు అని నమ్ముతారు. వివిధ రకాల పూజలు చేస్తారు. దేవుడు మాకంటే మాకని రెండు గ్రామాల ప్రజల కొట్లాడుతారు. సడెన్ గా కతిరావన్ కనిపించకుడా పోతాడు. ఆ తర్వాత గ్రామాల్లో గొడవలు పెద్దవిగా మారతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కతిరావన్ నిజంగానే చనిపోయాడా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం