ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో సాగే త‌మిళ‌ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-tamil horror thriller movie the akaali telugu version streaming on aha ott from april 26th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో సాగే త‌మిళ‌ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో సాగే త‌మిళ‌ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోకి వ‌చ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh HT Telugu

త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ది అకాళి తెలుగులోకి వ‌స్తోంది. ఏప్రిల్ 26 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హార‌ర్ మూవీలో నాజ‌ర్, త‌లైవాస‌ల్ విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ది అకాలి మూవీ

సీనియ‌ర్ యాక్ట‌ర్ నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కోలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ది అకాలి తెలుగులో వ‌స్తోంది.ఏప్రిల్ 26 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా ఓటీటీలోకి వ‌స్తోంది.

ది అకాళి త‌మిళ వెర్ష‌న్ కూడా ఆహా ఓటీటీలోనే అందుబాటులో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ హార‌ర్ మూవీకి మ‌హ‌మ్మ‌ద్ ఆసీఫ్ హ‌మీద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో నాజ‌ర్‌తో పాటు త‌లైవాస‌ల్ విజ‌య్‌, జ‌య‌కుమార్ జాన‌కిరామ‌న్‌, వినోద్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ట్విస్ట్‌లు హైలైట్‌...

గ‌త ఏడాది మే నెల‌లో ది అకాలి త‌మిళ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైంది.స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు సినిమాలోని ట్విస్ట్‌లు, హార‌ర్ ఎలిమెంట్స్‌, నాజ‌ర్ ప‌ర్ఫార్మెన్స్‌ బాగుందంటూ ప్ర‌శంస‌లు వినిపించాయి. మ‌ల్టీ జాన‌ర్ మూవీగా ద‌ర్శ‌కుడు మ‌హ‌మ్మ‌ద్ ఆసీఫ్ హ‌మీద్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

ది అకాలి మూవీ క‌థ ఇదే...

జానిస్ అనే అమ్మాయి క్షుద్ర‌విద్య‌లు స‌హాయంతో అమాయ‌కుల‌ను హ‌త్య చేస్తుంటుంది. ఈ మ‌ర్డ‌ర్స్ వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించేందుకు హ‌మ్జా అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎంట్రీ ఇస్తాడు. జానిస్ కుట్ర‌ల‌ను ఛేధించే క్ర‌మంలో అత‌డు తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి? జానిస్ మ‌నుషుల నుంచి హ‌మ్జాను కాపాడిన అనిత ఎవ‌రు? అనిత ఎందుకు వింత‌గా ప్ర‌వ‌ర్తించింది? జానిస్ పూజ‌ల‌ను హ‌మ్జా ఎలా అడ్డుకున్నాడు? ఆమెనే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుందా? జానిస్‌కు వెన‌క ఎవ‌రైనా ఉన్నారా అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

డార్క్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌...

కామెడీ, పాట‌లు లాంటి క‌మ‌ర్షియ‌ల్ అంశాలేవి లేకుండా సీరియ‌స్ డార్క్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ది అకాలి మూవీని తెర‌కెక్కించాడు. త‌మిళంలో చాలా కాలం త‌ర్వాత నాజ‌ర్ లీడ్ రోల్‌లో న‌టించిన మూవీ ఇది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ ప‌దికిగాను ఐదు రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.క‌మ‌ర్షియ‌ల్‌గా నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌...

ద‌క్షిణాదిలో బిజీ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు నాజ‌ర్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్‌లో నాజ‌ర్ క‌నిపించాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం