తమిళ హీరో జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించిన అగాథియా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ హిస్టారిక్ హారర్ థ్రిల్లర్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు పెద్దగా సాధించలేకపోయింది. ఈ మూవీకి పా విజయ్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍లో డిజాస్టర్ అయిన అగాథియా ఓటీటీలో మాత్రం అంచనాలకు మించి అదరగొడుతోంది.
అగాథియా సినిమా మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి తొలుత మోస్తరుగానే వ్యూస్ దక్కాయి. అయితే, ఆ తర్వాత క్రమంగా వ్యూస్ పెరిగాయి.
స్ట్రీమింగ్‍కు వచ్చిన సుమారు 10 రోజుల తర్వాత అగాథియా అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లోకి వచ్చింది. అప్పటి నుంచి టాప్-10లోనే ట్రెండ్ అవుతోంది. సుమారు 20 రోజులకు పైగా ట్రెండింగ్‍లో కొనసాగుతోంది. ప్రస్తుతం (మే 5) ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‍లో ఆరో ప్లేస్‍లో ఉంది. సినిమాల ట్రెండింగ్‍లో నాలుగో స్థానంలో ఉంది.
అగాథియా చిత్రం రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రెండు ఓటీటీల్లోనూ తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
అగాథియా సినిమా సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, కేవలం దాదాపు రూ.3కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కనీసం బడ్జెట్‍లో పావు భాగం కూడా రికవరీ చేయలేకపోయింది. కానీ ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం బాగా పర్ఫార్మ్ చేస్తోంది.
అగాథియా చిత్రంలో జీవా, అర్జున్‍తో పాటు రాశీ ఖన్నా, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే, దాతో రాధా రవి, మటిల్డా, సోనెన్‍బ్లిక్ కీలకపాత్రలు పోషించారు. ఓ భవనంలో సాగే హారర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ పా విజయ్. 18 శతకంలో సాగే ప్లాష్‍బ్యాక్ కీలకంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఇషారీ గణేశ్, అనీశ్ అర్జున్ దేవ్ నిర్మించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
ఓ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తుంటాడు అగాథియా (జీవా). డబ్బు సంపాదించేందుకు వీణ (రాశీ ఖన్నా)తో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి ఆ భవవాన్ని అతడు దెయ్యాలు ఉండే కోటలా మార్చేస్తాడు. అయితే, ఆ భవనంలో నిజంగానే అతీత శక్తులు ఉన్నాయని వారికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమైంది? సిద్ధార్థ్ (అర్జున్), ఎడ్విన్ (సోనెన్‍బ్లిక్) ఎవరు? మిస్టరీ ఏంటి? అనే అంశాలు అగాథియా చిత్రంలో ఉంటాయి.
సంబంధిత కథనం