తమిళంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శింబు. తెలుగులో మన్మథ, వల్లభ, మానాడు, పాతు తల సినిమాలతో చాలా పాపులర్ అయ్యాడు. అంతకుమించి తెలుగులో స్టార్ హీరోలకు పాటలు పాడి ఎప్పుడో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు శింబు.
మంచు మనోజ్ పోటుగాడు సినిమాలో బుజ్జి పిల్ల అనే పాటతో సింగర్‌గా టాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చిన శింబు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాద్‌షా మూవీలో డైమండ్ గర్ల్ సాంగ్‌తో అలరించాడు. అనంతరం నిఖిల్ 18 పేజీస్‌లో టైమ్ ఇవ్వు పిల్ల అంటూ ఆకట్టుకున్నాడు. అలాంటి శింబు నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం థగ్ లైఫ్.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, త్రిష, అభిరామి, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న వరల్డ్ వైడ్‌గా థగ్ లైఫ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇటీవల వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శింబు, నటుడు నాజర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
హీరో శింబు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. తెలుగు అభిమానులందరికీ ధన్యవాదాలు. జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
"ఓజీలో ఒక పాట పాడాను. ఆ పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. పవన్ కల్యాణ్ కోసం ఎప్పటినుంచో ఒక పాట పాడాలని ఉండేది. అది ఓజీ మూవీతో నెరవేరింది. పవన్ కల్యాణ్ గారి హరి హర వీరమల్లు సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్" అని తమిళ హీరో శింబు తెలిపాడు.
నటుడు నాజర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్‌లోనే కమల్ హాసన్ గారు చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే మరో చరిత్ర. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది" అని అన్నారు.
ఈ సినిమా ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు , బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు.. ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ హాసన్ గారు మణిరత్నం గారు 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ. ఈ సినిమా కచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్" అని నాజర్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్