లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందుకున్న యూత్ సెన్సేషన్, తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ సినిమా డ్యూడ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
'ప్రేమలు' వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన డ్యూడ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇటీవల డ్యూడ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించి డ్యూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సినిమా ప్రమోషన్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు ఆడియన్స్ ఇంత పెద్ద స్థాయిలో రావడం నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇంత ప్రేమని అందిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు" అని అన్నాడు.
"మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఇండియా. వాళ్లతో పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇండియాలో నెంబర్ వన్ సంస్థగా ఉన్నారో అర్థమైంది. చాలా ప్యాషన్‌తో పని చేస్తారు. డ్యూడ్ సినిమా ట్రైలర్‌కి తెలుగు తమిళ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈక్వల్‌గా వ్యూస్ రావడం నాకు చాలా సర్‌ప్రైజింగ్ అనిపించింది" అని ప్రదీప్ రంగనాథన్ తెలిపాడు.
"డ్యూడ్ ట్రైలర్‌లో మీరు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చూశారు. సినిమాలో చాలా డ్రామా ఎమోషన్ ఉంటుంది. మీరు ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్ గారికి థాంక్యూ. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్" అని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు.
"యూత్‌తో పాటు ఫ్యామిలీస్ సినిమాని ఇష్టపడతారు. దీపావళికి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న తెలుసు కదా, మిత్ర మండలి, కే ర్యాంప్ సినిమాలు అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను. డ్యూడ్ సినిమా కచ్చితంగా తెలుగు ఆడియన్స్‌కి నచ్చుతుంది" అని తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం