Pradeep Ranganathan: ఆ తెలుగు సినిమా చూసి చాలా ఏడ్చాను.. నా మైండ్ బ్లాక్ అయింది.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కామెంట్స్-tamil hero pradeep ranganathan comments in return of the dragon pre release event says he cried after watching baby film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pradeep Ranganathan: ఆ తెలుగు సినిమా చూసి చాలా ఏడ్చాను.. నా మైండ్ బ్లాక్ అయింది.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కామెంట్స్

Pradeep Ranganathan: ఆ తెలుగు సినిమా చూసి చాలా ఏడ్చాను.. నా మైండ్ బ్లాక్ అయింది.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Pradeep Ranganathan In Return Of The Dragon Pre Release Event: తమిళ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఓ తెలుగు సినిమా చూసి ఏడ్చినట్లు రీసెంట్‌గా చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 16న ఘనంగా జరిగిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ తెలుగు సినిమా చూసి చాలా ఏడ్చాను.. నా మైండ్ బ్లాక్ అయింది.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కామెంట్స్

Pradeep Ranganathan In Return Of The Dragon Pre Release Event: కోమలి సినిమాతో డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే మూవీలో హీరోగా చేసి మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేస్తున్న సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది.

తెలుగులో మాట్లాడి

అనుపమతోపాటు కాయదు లోహర్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా తెలుగులో కూడా థియేటర్లలో విడుదల కానుంది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ. ఈ నేపథ్యంలో ఇటీవల ఆదివారం (ఫిబ్రవరి 16) డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రయత్నించామా లేదా

"లవ్ టుడే సమయంలో ఇక్కడకు వచ్చినప్పుడు అందరికీ మాట ఇచ్చా. నెక్ట్స్ టైం ఇక్కడకు వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతా అని చెప్పా. అందుకే ఇప్పుడు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. మాటిస్తే చేస్తామా? లేదా? అన్న దానికంటే.. అసలు ప్రయత్నించామా? లేదా? అన్నదే ముఖ్యం. అదే మా డ్రాగన్ చిత్రం" అని ప్రదీప్ రంగనాథన్ తెలిపాడు.

ఒకరోజు సాధిస్తాం

"ఓ మామూలు అబ్బాయి.. జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా డ్రాగన్. ప్రతీ ఒక్కరం ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నించే ప్రతీ ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఏదైనా సరే ప్రయత్నిస్తూ వెళ్తూ ఉంటే.. ఏదో ఒకరోజు సాధిస్తాం" అని హీరో ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

చాలా మాట్లాడాను

"లవ్ టుడే సినిమాను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. బేబీ మూవీని చూసిన తరువాత సాయి రాజేష్ గారితో చాలా మాట్లాడాను. నేను ఆ మూవీని చూసి చాలా ఏడ్చాను. మూవీని చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మా కోసం వచ్చిన కిషోర్ తిరుమల గారు, హరీష్ శంకర్ గారు, ఎస్‌కే‌ఎన్ గారికి థాంక్స్. మా సినిమాను నిర్మించిన అర్చన మేడంకి థాంక్స్" అని ప్రదీప్ రంగనాథన్ తెలిపాడు.

ఫ్రెండ్‌తో పని చేయడం

"అశ్వత్ మారిముత్తు (డైరెక్టర్) నేను కాలేజ్‌‌లో ఉండేవాళ్లం. మాది పదేళ్ల పరిచయం. అశ్వత్ లాంటి ఓ ఫ్రెండ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రికి థాంక్స్. మైత్రి బ్యానర్‌లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మళ్లీ అర్చన గారు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని ప్రదీప్ రంగనాథ్ తన స్పీచ్ ముగించాడు.

లవ్ టుడే మాదిరిగానే

డైరెక్ట‌ర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. "ప్రదీప్ రంగనాథన్ రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్‌కు చాలా పెద్ద అభిమానిని. ఈ డ్రాగన్ చిత్రం కూడా లవ్ టుడే మాదిరిగానే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రదీప్, అశ్వత్ గారు నా ‘బేబీ’ టైంలో ఫోన్ చేసి మెచ్చుకున్నారు. డ్రాగన్ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని చెప్పారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం