సిబి సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన టెన్ హవర్స్ సినిమా ఏప్రిల్ 18న విడుదలైంది. థియేట్రికల్ రన్‍లో ఈ తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. కిడ్నాప్, మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ఇళయరాజా కలియపెరుమాల్. థియేటర్లలో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయిన టెన్ హవర్స్ ఓటీటీలో సత్తాచాటుతోంది.
టెన్ హవర్స్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో గత వారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమాకు క్రమంగా వ్యూస్ పెరుగుతున్నాయి. స్ట్రీమింగ్ తర్వాత రెస్పాన్స్ బాగుండటంతో ఆదరణ దక్కుతోంది. దీంతో ఈ మూవీ నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో మూడో స్థానానికి దూసుకొచ్చేసింది. కొన్ని పెద్ద సినిమాలను దాటుకొని ట్రెండింగ్‍లో ఎగబాకింది.
రూ.5కోట్లలోపు బడ్జెట్‍తోనే టెన్ హవర్స్ చిత్రం రూపొందింది. తక్కువ బజ్‍తోనే ఓటీటీలోకి వచ్చింది. కానీ స్ట్రీమింగ్ తర్వాత దుమ్మురేపుతోంది. ఈ లోబడ్జెట్ చిత్రం ఏకంగా ప్రైమ్ వీడియో సినిమాల ట్రెండింగ్‍లో ప్రస్తుతం (మే 13) టాప్-3లోకి అడుగుపెట్టింది.
టెన్ హవర్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. సన్ నెక్స్ట్, టెంట్‍కొట్టా ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ చిత్రం మూడు ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది.
టెన్ హవర్స్ చిత్రం ఒక్క రాత్రిలోనే సాగే ఓవర్ నైట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. కిడ్నాప్ అయిన ఓ అమ్మాయిని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు ఇన్‍స్పెక్టర్ కాస్ట్రో (సిబి సత్యరాజ్). ఈ క్రమంలోనే చెన్నై - కోయంబత్తూరు బస్సులో రాత్రి మర్డర్ జరుగుతుంది. ఆ రాత్రే ఈ మర్డర్ కేసును కాస్ట్రో దర్యాప్తు చేయాల్సి వస్తుంది. 10 గంటలే మిగిలి ఉంటుంది. కిడ్నాప్ అయిందెవరు? ఈ మర్డర్ మిస్టరీ ఏంటి? కాస్ట్రో ఛేదించాడా అనేవి అంశాల చుట్టూ టెన్ హవర్స్ సినిమా సాగుతుంది.
ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్‍తో టెన్ హవర్స్ మూవీని ఇళయరాజా కలియపెరుమాల్ తెరకెక్కించారు. ఈ మూవీలో గజరాజ్, రాజా అయ్యప్ప, దిలీపన్, జీవరవి కీరోల్స్ చేశారు. డువిన్ స్టూడియోస్ బ్యానర్ కింద లతా బాలు, దుర్గాని వినోద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం