తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మార్చిలో రిలీజైన ఈ సినిమా.. సుమారు 50 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పెద్దగా స్టార్లు లేని ఈ మూవీకి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అంతంతమాత్రం రెస్పాన్స్ వచ్చినా.. ఐఎండీబీలో మాత్రం 8.9 రేటింగ్ సంపాదించడం విశేషం.
ఓటీటీలోకి వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు అస్త్రం (Asthram). ఈ మూవీని ఆహా తమిళం ఓటీటీ మే 9 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“యాక్షన్ ట్రీట్ ఆన్ ద వే ఫ్రెండ్స్. అస్త్రం మే 9న మన ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
అస్త్రం మూవీ ఈ ఏడాది మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను అరవింద్ రాజగోపాల్ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా కావడం విశేషం. శామ్, నిరంజని లీడ్ రోల్స్ లో కనిపించారు. ఈ అస్త్రం ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఇన్‌స్పెక్టర్ అకిలన్ పాత్రలో శామ్ నటించాడు.
వరుస ఆత్మహత్యలను దర్యాప్తు చేసే డిటెక్టివ్ గా అతడు కనిపించాడు. ఈ ఆత్మహత్యలు చాలా వింతగా ఉంటాయి. బాధితుల శరీరాలపై కత్తి గాట్లు ఉంటాయి. దీంతో ఇవి ఆత్మహత్యలు కావని తేలుతుంది. అయితే దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు ఏం జరిగింది అన్నది ఈ అస్త్రం మూవీలో చూడొచ్చు.
థియేటర్లలో రిలీజైన సమయంలో ఓ మోస్తరు రివ్యూలు వచ్చాయి. అయితే ఐఎండీబీలో పలువురు ప్రేక్షకులు ఈ సినిమాకు 8.9 రేటింగ్ ఇచ్చారు. అలాంటి సినిమా ఇప్పుడు ఆహా తమిళం ఓటీటీలో మే 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం