ఓటీటీలోకి తెలుగులో వస్తున్న సూపర్ హిట్ తమిళ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. ఐఎండీబీలో 8.7 రేటింగ్-tamil comedy web series office in telugu to stream on jiohotstar from 9th may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తెలుగులో వస్తున్న సూపర్ హిట్ తమిళ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. ఐఎండీబీలో 8.7 రేటింగ్

ఓటీటీలోకి తెలుగులో వస్తున్న సూపర్ హిట్ తమిళ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. ఐఎండీబీలో 8.7 రేటింగ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ తమిళ కామెడీ వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడిస్తూ.. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఓ చిన్న ట్రైలర్ రిలీజ్ చేసింది. ఆ వెబ్ సిరీస్ వివరాలేంటో చూడండి.

ఓటీటీలోకి తెలుగులో వస్తున్న సూపర్ హిట్ తమిళ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. ఐఎండీబీలో 8.7 రేటింగ్

తమిళ వెబ్ సిరీస్ ఒకటి తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి ఈ సిరీస్ తమిళంలో స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పుడీ సిరీస్ ను తెలుగులోకి డబ్ చేసి తీసుకొస్తున్నారు. ఈ కామెడీ వెబ్ సిరీస్ పేరు ఆఫీస్. అసలు ఈ సిరీస్ ఏంటి? స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాలు తెలుసుకోండి.

ఆఫీస్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్

ఆఫీస్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక కామెడీ సిట్‌కామ్ వెబ్ సిరీస్. ఇప్పుడీ సిరీస్ ను తెలుగులోకి తీసుకొస్తున్నట్లు జియోహాట్‌స్టార్ బుధవారం (మే 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“హాట్‌స్టార్ స్పెషల్స్ ఆఫీస్ తెలుగులో ఎక్స్‌క్లూజివ్ గా మే 9 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఓ 40 సెకన్ల వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఆఫీస్ వెబ్ సిరీస్ గురించి..

ఆఫీస్ వెబ్ సిరీస్ లో గురు లక్ష్మణ్, స్మేహ మణిమేగలై, కీర్తవేల్, తమిళ్‌వణి, శివ అరవింద్ లాంటి వాళ్లు నటించారు. వెట్రి ఈ సిరీస్ కు కథ అందించాడు. అబ్దుల్ కబీజ్ డైరెక్ట్ చేశాడు. 40 ఎపిసోడ్ల పాటు సాగిన వెబ్ సిరీస్ ఇది. తమిళనాడులోని ఓ చిన్న ఊళ్లో ఉండే తహసీల్దార్ ఆఫీసులో సరదాగా సాగిపోయే స్టోరీ. ఆ ఆఫీసుకు కంప్యూటర్ ఇంజినీర్ గా వచ్చే పారి అనే వ్యక్తిని పొరపాటున కలెక్టర్ గా భావించి ఘనంగా స్వాగతం పలుకుతారు.

ఆ తర్వాత వచ్చే సీన్లు సరదాగా అనిపిస్తాయి. ఈ గందరగోళంతోపాటు అతనికి ఓ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ ఆఫీస్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 21 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 40 ఎపిసోడ్లు ఉన్నాయి. వీటిని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. మే 9 నుంచి జియోహాట్‌స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం