ఓటీటీల్లో ఇటీవలికాలంలో కామెడీ వెబ్ సిరీస్‍ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ జానర్ సిరీస్‍లు వరుసగా వస్తున్నాయి. తాజాగా ‘సెరుప్పుగల్ జాకిరతై’ అనే కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. సింగపులి ఈ సిరీస్‍లో లీడ్ పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్ మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‍కు రాజేశ్ సుసైరాజ్ దర్శకత్వం వహించారు.
సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్‍లో సింగంపులితో పాటు వివేక్ రాజగోపాల్, ఐరా అగర్వాల్, మనోహర్, ఇంద్రజిత్, మాప్ల గణేశ్, ఉసైన్, సబిత, పళని, ఉతుమలై రవి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎల్‍వీ ముత్తుగణేశ్ సంగీతం అందించారు. ఎజిచూర్ అరవిందన్ ఈ ఈ సిరీస్‍కు కథ అందించగా.. డైరెక్టర్ రాజేశ్ తెరకెక్కించారు.
వజ్రాలు స్మగ్లింగ్ చేస్ రత్నం తన ఇంటిపై అధికారులు రైడ్ చేస్తారని భయపడతాడు. ఓ విలువైన వజ్రాన్ని ఓ షూలో దాచి పెడతాడు. పొరపాటును ఆ షూను త్యాగరాజన్ అనే ఆడిటర్ వేసుకొని వెళతాడు. త్యాగరాజన్, అతడి కుమారుడు ఇలాంగో ఆ షూను పోగడతారు. ఆ షూను దొరికించుకునేందుకు రత్నం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని ట్విస్టులు, మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ ఆ షూ ఏమైంది.. రత్రం దాన్ని కనిపెట్టగలిగాడా అనేది సెరుప్పుగల్ జాకిరతై సిరీస్‍లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. కామెడీతో ఫన్‍గా, థ్రిల్లింగ్‍గా ఆ సిరీస్ సాగుతుంది.
తమిళ కామెడీ డ్రామా చిత్రం కుటుంబస్థాన్.. ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అదరగొడుతోంది. మార్చి 7వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంలో మణికందన్ ప్రధాన పాత్ర పోషించారు. జనవరి 24న థియేటర్లలో రిలీజైన కుటుంబస్థాన్ మంచి హిట్ అయింది. రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ కమర్షియల్‍గా సక్సెస్ కాగా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.
సంబంధిత కథనం