Comedy OTT: ఓటీటీలోకి తంగలాన్ డైరెక్టర్ కామెడీ మూవీ - ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్ - మందు బాబుల కష్టాలతో
Comedy OTT:తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించిన తమిళ కామెడీ డ్రామా మూవీ బాటిల్ రాధ ఓటీటీలోకి రాబోతుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.

Comedy OTT: తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించిన తమిళ మూవీ బాటిల్ రాధ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన బాటిల్ రాధ ఓటీటీలోకి వస్తోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఫిబ్రవరి 21 లేదా 28న ఈ మూవీ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో...
బాటిల్ రాధ మూవీలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ కామెడీ డ్రామా మూవీకి పా రంజిత్ అసిస్టెంట్ దినకరణ్ శివలింగం దర్శకత్వం వహించాడు. 2013లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ధర్మశాలతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యింది. థియేటర్లలో ఈ ఏడాది జనవరి 24న రిలీజ్ చేశారు. కాన్సెప్ట్, యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా మాత్రం మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది.
మద్యపానం...
మద్యపానం వల్ల తలెత్తే అనర్థాలను రియలిస్టిక్‌గా బాటిల్ రాధ మూవీలో చూపించాడు డైరెక్టర్. మెసేజ్‌ను కామెడీ అంశాలతో సెటైరికల్‌గా ఆవిష్కరించారు. రాధ మణి మేస్త్రిగా పనిచేస్తుంటాడు. కూలీ పనుల వల్ల వచ్చే డబ్బులను తాగుడుకు కేటాయిస్తూ జల్సాలు చేస్తుంటాడు. భర్త తాగుడు వల్ల అంజలామ్ ఇబ్బందలు పడుతుంది. భర్తలో మార్పు తీసుకురావడానికి అంజలామ్ ఏం చేసింది? రిహాబిలిటేషన్‌లో చేరిన రాధమణి అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? భార్య పిల్లల కోసం ఎలా తాగుడు దూరమయ్యాడు అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో...
బాటిల్ రాధ కాన్సెప్ట్‌తో పాటు గురు సోమసుందరం, సంచన నటరాజన్ యాక్టింగ్ బాగుదంటూ క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందించాడు. బాటిల్ రాధ మూవీలో హీరోయిన్‌గా నటించిన సంచన నటరాజన్ తెలుగులో వెంకటేష్ గురుతో పాటు గేమ్ ఓవర్ సినిమాలు చేసింది.
తంగలాన్...
తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతోన్న పా రంజిత్ ప్రొడ్యూసర్‌గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాడు. విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. 100 కోట్ల బడ్జెట్‌తో హిస్టారియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 70 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది.
సంబంధిత కథనం