ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరుగాంచిన సిమ్రన్ నటించిన మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). ఈ సినిమా మే 1న థియేటర్లలో రిలీజైంది. అదే రోజు సూర్య నటించిన రెట్రో కూడా వచ్చినా.. ఆ సినిమాకు దీటుగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
తమిళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచిన మూవీ ఈ టూరిస్ట్ ఫ్యామిలీ. రూ.14 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. రెండు వారాల్లోనే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మే 31 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులు వెల్లడించాయి.
నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకే తీసుకొద్దామని మొదట మేకర్స్ భావించినా.. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. అది కూడా సూర్య నటించిన రెట్రో మూవీకి పోటీగా కావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ మూవీ.. ఓటీటీలో మరింత దుమ్ము రేపడం ఖాయంగా భావిస్తున్నారు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను అభిషన్ జీవింత్ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి మూవీ. శశికుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఏప్రిల్ 29న ప్రీమియర్ కాగా.. మే 1న థియేటర్లలో రిలీజైంది. మిలియన్ డాలర్ స్టూడియోస్ ఈ సినిమాను తెరకెక్కింది.
ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మనసుకు హత్తుకునే ఓ ఫ్యామిలీ డ్రామా. కొవిడ్ 19, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో శ్రీలంకలో నివసించే ఓ తమిళ కుటుంబం తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఇండియాకు రావాల్సి వస్తుంది. ఆ అనిశ్చిత పరిస్థితుల్లో తమ స్వదేశానికి వచ్చి తిరిగి తమ జీవితాన్ని కొత్తగా మొదలు పెడతారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఈ కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నదాన్ని సరదాగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు.
ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటుంది. ఇదే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించేలా చేసింది. రూ.14 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఐఎండీబీలోనూ 8.8 రేటింగ్ సాధించింది. ఈ మూవీ మే 31 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం