OTT Family Comedy: ఓటీటీలోకి నయా కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..-tamil comedy drama movie baby and baby will be streaming on sunnxt ott from march 21 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Comedy: ఓటీటీలోకి నయా కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

OTT Family Comedy: ఓటీటీలోకి నయా కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

OTT Comedy: బేబీ అండే బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ కామెడీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

OTT Family Comedy: ఓటీటీలోకి నయా కామెడీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

తమిళ హీరో జై, సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో బేబీ అండ్ బేబీ సినిమా వచ్చింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. ఈ బేబీ అండ్ బేబీ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

బేబీ అండ్ బేబీ స్ట్రీమింగ్ డేట్

బేబీ అండ్ బేబీ సినిమా ఈ శుక్రవారం (మార్చి 21) సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. “డబుల్ ఫన్‍కు రెడీగా ఉండండి. బేబీ అండ్ బేబీ మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ అవనుంది” అని సోషల్ మీడియాలో సన్‍నెక్స్ట్ పోస్ట్ చేసింది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాలకు బేబీ అండ్ బేబీ స్ట్రీమింగ్‍కు వస్తోంది.

బేబీ అండ్ బేబీ చిత్రంలో జై, సత్యరాజ్‍తో పాటు యోగిబాబు, ప్రగ్యా నగ్రా, కీర్తన, సాయిధన్య, ఇళవరసు, శ్రీమాన్, ఆనందరాజ్, నిళయగల్ రవి, సింగం పులి, రెడిన్ కింగ్‍స్లే కీలకపాత్రలు పోషించారు. రెండు జంటలకు చెందిన శిశువులు మారిపోవడం, ఆ విషయాన్ని పెద్దల వద్ద దాచేందుకు వారు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీని కామెడీ ప్రధానంగా తెరకెక్కించారు డైరెక్టర్ ప్రతాప్.

బేబీ అండ్ బేబీ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోంది. యువరాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బీ.యువరాజ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి డీ.ఇమ్మాన్ సంగీతం అందించారు.

బేబీ అండ్ బేబీ స్టోరీలైన్

బేబీ అండ్ బేబీ చిత్రం రెండు జంటల మధ్య సాగుతుంది. శివ (జై), ప్రియ (ప్రజ్ఞా నగ్రా) ఓ బాబుకు జన్మనిస్తారు. ఇంటికి వెళ్లేందుకు విమానాశ్రంలో వేచిచూస్తుంటారు. తన పిల్లల్లో శివ ఒక్కడే కొడుకును కనడంతో యావదాస్తికి ఆ పిల్లాడినే వారసుడిగా మహాలింగం (సత్యరాజ్). మరోవైపు, గుణ (యోగి బాబు), మలర్ (సాయి ధన్య) ఓ పాపకు జన్మనిస్తారు. పాపతో పాటు ఊరెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తారు. ఆడపిల్ల అదృష్టం అని భావించి తన మనవరాలికి మొత్తం ఆస్తి రాసిచ్చేందుకు గుణ తండ్రి ముత్తయ్య (ఇళవరసు) సిద్ధమవుతాడు. అయితే, విమానాశ్రయంలో శివ, గుణ పిల్లలు మారిపోతారు. గుణ పాపను శివ, శివ పిల్లాడిని గుణ తీసుకెళ్లిపోతారు.

ఈ విషయాన్ని వారి కుటుంబ పెద్దల నుంచి దాచేందుకు నానా తంటారు పడతారు శివ, గుణ. ఇక, ఆ పిల్లలను వారసులుగా ప్రకటించడం ఆ రెండు కుటుంబ సభ్యుల్లోని కొందరికి నచ్చదు. వారు వేరే ప్లాన్లు వేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? శివ, గుణ మళ్లీ తమ పిల్లలను మార్చేసుకున్నారా? కుటుంబ సభ్యులు ఏం ప్లాన్ చేశారు? అనే అంశాల చుట్టూ బేబీ అండ్ బేబీ చిత్రం సాగుతుంది.

కాగా, తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ‘డ్రాగన్’ మార్చి 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం రూ.150కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం