హృద‌యాన్ని హ‌త్తుకునే త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. డేటింగ్ లో ప్రెగ్నెన్సీ వస్తే.. రెండేళ్ల తర్వాత తెలుగులో థియేట‌ర్ల‌కు-tamil blockbuster dada movie to dubbed in telugu as papa and release in theatres on 13th june ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హృద‌యాన్ని హ‌త్తుకునే త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. డేటింగ్ లో ప్రెగ్నెన్సీ వస్తే.. రెండేళ్ల తర్వాత తెలుగులో థియేట‌ర్ల‌కు

హృద‌యాన్ని హ‌త్తుకునే త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. డేటింగ్ లో ప్రెగ్నెన్సీ వస్తే.. రెండేళ్ల తర్వాత తెలుగులో థియేట‌ర్ల‌కు

తమిళంలో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన దాదా మూవీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు వచ్చేస్తోంది. రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ తో థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమైంది.

థియేటర్లలోకి తమిళ్ సూపర్ హిట్ మూవీ (x)

ఇతర భాషల్లో సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం, డబ్ అవడం కామనే. కానీ 2023లో తమిళంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ రొమాంటిక్ యూత్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇప్పుడు తెలుగులో థియేటర్లకు రాబోతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత బిగ్ స్క్రీన్ పైకి సినిమా వస్తుండటం గమనార్హం.

దాదా నుంచి పాపాగా

2023లో వచ్చిన తమిళ్ సినిమా ‘దాదా’ సూపర్ హిట్ గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. కెవిన్, అపర్ణా దాస్ ఈ మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘పాపా’ పేరుతో డబ్ కానుంది. జూన్ 13న తెలుగులో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా.

రొమాంటిక్ సీన్స్ తో

లాస్ట్ ఇయర్ కాలేజీ స్టూడెంట్స్ మణికందన్ (కెవిన్), సింధు (అపర్ణా దాస్) రిలేషన్ షిప్ లో ఉంటారు. డేటింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ను అట్రాక్ట్ చేస్తాయి. అయితే వీళ్లకు పెళ్లి కాకముందే సింధుకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో ఆ ఇద్దరి జీవిత తలకిందులవుతుంది. అబార్షన్ చేయించుకోమని మణికందన్ చెప్తే.. సింధు వినదు.

బాబు పుట్టాక

మణికందన్, సింధు ఇల్లు రెంట్ కు తీసుకుని ఉంటారు. అయితే బాబు పుట్టాక సింధు ఎక్కడికో వెళ్లిపోతుంది. ఆ బాబును ఏం చేయాలో తెలియక మణికందన్ టెన్షన్ పడుతుంటాడు. అనాథశ్రమంలో వదిలేద్దామనుకుని మళ్లీ ఆలోచన విరమించుకుంటాడు. తానే బాధ్యత తీసుకుని పెంచుతాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఓ ఆఫీస్ వెళ్తే అక్కడ మేనేజర్ గా సింధు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సింధు ఎందుకు వెళ్లిపోయింది? బాబు గురించి తెలిసిందా? అన్నదే కథ.

ఫ్యామిలీ డ్రామాతో

యంగ్ ఏజ్ లో ఎవరైనా తప్పు ఒప్పుల గురించి ఆలోచించరు. కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుంటారు. బిడ్డను పెంచడం కేవలం తల్లి పని మాత్రమే కాదు.. తండ్రి ఎలాంటి బాధ్యతతో ఉండాలని దాదా సినిమా చూపిస్తోంది. అల్లరి చిల్లరగా తిరిగి ఓ యువకుడు తండ్రి అయ్యాక ఎలా మారాడు? ఆ బాబు రాకతో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ మూవీలో యాక్టింగ్ కు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డును అపర్ణా సొంతం చేసుకుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం