47 ఏళ్ల వయసులో 35 ఏళ్ల హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో-tamil actor vishal to marry actress sai dhanshika soon says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  47 ఏళ్ల వయసులో 35 ఏళ్ల హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో

47 ఏళ్ల వయసులో 35 ఏళ్ల హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో

Hari Prasad S HT Telugu

తమిళ నటుడు విశాల్ 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబుతున్నాడు. ఈ మధ్యే ఓ స్టేజ్ పైనే కుప్పకూలి వార్తల్లో నిలిచిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతుండటం విశేషం. త్వరలోనే అతని పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

47 ఏళ్ల వయసులో 35 ఏళ్ల హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో

తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల కూడా దగ్గరైన నటుడు విశాల్. గత కొంత కాలంగా అతనికి సంబంధించిన అనారోగ్య వార్తలే తెరపైకి వస్తుండగా.. ఇప్పుడు అతడో 35 ఏళ్ల హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త అభిమానులను ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? పెళ్లి ఎప్పుడు జరగబోతోందన్న విశేషాలు చూడండి.

తన పెళ్లి గురించి చెప్పిన విశాల్

తమిళ నటుడు విశాల్ ఈ మధ్యే తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు. త్వరలోనే తాను ఓ ఇంటివాడిని కాబోతున్నానని, అది కూడా లవ్ మ్యారేజీ అని అతడు చెప్పడం విశేషం. ఇక విశాల్ పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ పేరు సాయి ధన్షిక.

నడిగర్ సంఘం (తమిళ సినిమా నటీనటుల సంఘం)లో సభ్యుడైన విశాల్.. గతంలో ఓసారి మాట్లాడుతూ తాను ఈ సంఘానికి చెందిన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇప్పుడీ భవనం పూర్తి కావస్తొండటంతో మరి పెళ్లి సంగతేంటని ఈ మధ్య మీడియా అతన్ని అడిగింది.

దీనికి విశాల్ స్పందిస్తూ.. “అవును.. నాకు అమ్మాయి దొరికేసింది. పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నాం. మాది లవ్ మ్యారేజీయే. అమ్మాయి, పెళ్లి తేదీ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను” అని చెప్పాడు. దీంతో 47 ఏళ్ల వయసులో విశాల్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.

సాయి ధన్షికతోనే పెళ్లి?

ఇక సాయి ధన్షికతోనే విశాల్ పెళ్లి జరగనున్నట్లు వస్తున్న వార్తలను అతని సన్నిహిత వర్గాలు కూడా కన్ఫమ్ చేశాయి. అంతేకాదు ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యోగి డా ఈవెంట్ కు కూడా విశాల్ చీఫ్ గెస్ట్ కావడం విశేషం. ఈ ఈవెంట్ సోమవారం (మే 19) జరగనుంది. ఇదే ఈవెంట్లో అతడు తన పెళ్లి గురించి కూడా అనౌన్స్ చేస్తాడని భావిస్తున్నారు. ఈ ఇద్దరూ కొన్ని నెలల కిందటే కలిశారు. వాళ్ల స్నేహం కాస్తా ప్రేమగా మారింది.

మరో నాలుగు నెలల్లో తన పెళ్లి అని విశాల్ చెప్పడంతో ముందుగా వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై అటు విశాల్ నుంచి గానీ, ఇటు సాయి ధన్షిక నుంచిగానీ ఎలాంటి సమాచారం రాలేదు. నిజానికి విశాల్ గతంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

విశాల్ అనారోగ్యం

విశాల్ ఈ మధ్యే ఓ స్టేజ్ పై కుప్పకూలిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా అతని అనారోగ్య వార్తలు అభిమానులను కలవరపరుస్తున్నాయి. విల్లుపురంలోని కూవగం కూతాండవర్ టెంపుల్ ఫెస్టివల్ సందర్భంగా సౌత్ ఇండియా ట్రాన్స్జెండర్ ఫెడరేషన్ తరఫున ఈవెంట్ నిర్వహించారు. వేదికపై మాట్లాడి ఫోటోలు తీస్తున్న సమయంలో విశాల్ అకస్మాత్తుగా స్పృహతప్పి కింద పడిపోయాడు. మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్లే విశాల్ అలా పడిపోయాడని చెప్పారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం