కూలి పని చేశాను.. రోజుకు రూ.20 ఇచ్చేవారు.. బన్ను కొనడానికి కూడా డబ్బుల్లేకపోయేవి: తమిళ నటుడి కామెంట్స్ వైరల్-tamil actor soori says he worked as a daily labour for rs 20 a day viduthalai maaman actor soori ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కూలి పని చేశాను.. రోజుకు రూ.20 ఇచ్చేవారు.. బన్ను కొనడానికి కూడా డబ్బుల్లేకపోయేవి: తమిళ నటుడి కామెంట్స్ వైరల్

కూలి పని చేశాను.. రోజుకు రూ.20 ఇచ్చేవారు.. బన్ను కొనడానికి కూడా డబ్బుల్లేకపోయేవి: తమిళ నటుడి కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

విడుదల సినిమాతో తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటుడు సూరి ఒకప్పటి తన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తాను రోజు కూలీగా పని చేశానని, రోజుకు రూ.20 సంపాదించిన రోజులను గుర్తు చేసుకున్నాడు.

కూలి పని చేశాను.. రోజుకు రూ.20 ఇచ్చేవారు.. బన్ను కొనడానికి కూడా డబ్బుల్లేకపోయేవి: తమిళ నటుడి కామెంట్స్ వైరల్

వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదల మూవీతో 2023లో లీడ్ రోల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సూరి. అంతకుముందు 25 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో చిన్నాచితకా రోల్స్ చేసుకుంటూ వచ్చిన అతనికి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యే మామన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూరి.. 30 ఏళ్ల కిందటి తన కష్టాలను చెప్పుకున్నాడు. రోజు కూలీగా పని చేసిన తాను ఇప్పుడీ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించాడు.

రోజుకూలీగా పని చేసిన సూరి

తమిళ నటుడు సూరి 1998లోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే 2023లో వచ్చిన విడుదల మూవీ అతని కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మధ్యే ఓ ఈవెంట్లో పాల్గొన్న సూరి.. 1993లో తాను రోజుకూలీగా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో రోజుకు రూ.20 సంపాదించేవాడినని, వారానికి వచ్చిన రూ.140లో రూ.70 ఇంటికి పంపించి మిగిలిన డబ్బుతో గడిపేవాడినని చెప్పాడు.

“నేను 1993లో తిరుప్పూరులో కొందరు స్నేహితులతో కలిసి పని చేయడం ప్రారంభించాను. మా రోజు కూలీ కేవలం రూ.20. వారం తర్వాత మాకు రూ.140 వచ్చేవి. అందులో నేను రూ.70 ఉంచుకొని మిగతావి ఇంటికి పంపేవాడిని. దగ్గర్లో ఓ బేకరీ ఉండేది. అక్కడి కొబ్బరి బన్ను రూపాయి పావలాకు వచ్చేది. నేను టీ, బన్ను తింటే నా డబ్బంతా అయిపోతుందని కేవలం టీ మాత్రమే తాగేవాడిని” అని సూరి చెప్పుకొచ్చాడు.

తిరుప్పూరులో పడిన కష్టాలు మంచి జీవిత పాఠాలు చెప్పాయని సూరి అన్నాడు. ఇప్పుడు వస్తున్న ప్రశంసలు చూసి తానెంతగానో సంతోష పడుతున్నట్లు అతడు చెప్పాడు.

సూరి మూవీస్

సూరి 1998 నుంచి తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు. కమెడియన్ గానూ కనిపించాడు. అయితే 2023లో వచ్చిన వెట్రిమారన్ మూవీ విడుదల పార్ట్ 1లో పోలీస్ కానిస్టేబుల్ గా అతడు నటించాడు. ఈ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ మధ్యే విడుదల పార్ట్ 2లోనూ నటించాడు. ఇవే కాకుండా గరుడన్, కొట్టుక్కాలి, మామన్ లాంటి సినిమాల్లో సూరి నటించడం విశేషం. త్వరలోనే అతడు యెరు కాదల్ యెరె మలై అనే మూవీలో నటించబోతున్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం