ఇదేమైనా పద్ధతిగా ఉందా.. రూ.100 కోట్లు కట్టు: కష్టాల్లో తమిళ నటుడు సంతానం.. గోవింద నామాలను అవమానించడంపై టీటీడీ ఆగ్రహం-tamil actor santhanam faces defamation case for misusing of govinda namas in his song kissa 47 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇదేమైనా పద్ధతిగా ఉందా.. రూ.100 కోట్లు కట్టు: కష్టాల్లో తమిళ నటుడు సంతానం.. గోవింద నామాలను అవమానించడంపై టీటీడీ ఆగ్రహం

ఇదేమైనా పద్ధతిగా ఉందా.. రూ.100 కోట్లు కట్టు: కష్టాల్లో తమిళ నటుడు సంతానం.. గోవింద నామాలను అవమానించడంపై టీటీడీ ఆగ్రహం

Hari Prasad S HT Telugu

తమిళ నటుడు సంతానం చిక్కుల్లో పడ్డాడు. తన నెక్ట్స్ మూవీ డీడీ నెక్ట్స్ లెవెల్ లోని పాట కిస్సా 47లో గోవింద నామాలను తప్పుగా వాడుకోవడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై పరువు నష్టం దావా వేయడంతోపాటు రూ.100 కోట్లు కట్టాలని డిమాండ్ చేసింది.

ఇదేమైనా పద్ధతిగా ఉందా.. రూ.100 కోట్లు కట్టు: కష్టాల్లో తమిళ నటుడు సంతానం.. గోవింద నామాలను అవమానించడంపై టీటీడీ ఆగ్రహం

తిరుమలలో కొలువైన శ్రీవారికి సంబంధించిన గోవింద నామాలను భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పలుకుతారు. అలాంటి వాటిని ఓ అసభ్యకరమైన పాటలో చేర్చడంపై ఇప్పుడు టీటీడీతోపాటు శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు. తమిళ నటుడు సంతానం మూవీ డీడీ నెక్ట్స్ లెవెల్ సాంగ్ కిస్సా 47లో శ్రీనివాస గోవిందా అనే పదాలను దారుణంగా చూపించడంతో చిక్కుల్లో పడ్డాడు.

బీజేపీ, జనసేన ఆగ్రహం

డీడీ నెక్ట్స్ లెవెల్ మూవీలోని కిస్సా 47 సాంగ్ రెండు నెలల కిందటే రిలీజైంది. ఈ మూవీ మే 16న రిలీజ్ కాబోతోంది. ఈ సమయంలో ఈ పాటపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. గోవింద నామాలను ఇలా ఓ అసభ్యకరమైన పాటలో వాడటంపై బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డితోపాటు జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అలా చేయలేకపోతే రూ.100 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కిరణ్ రాయల్ ఇప్పటికే తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామిని కలిసి ఈ వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

నటుడు సంతానంకు నోటీసులు

తమిళ నటుడు సంతానంకు టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం నోటీసులను పంపించారు. అతనితోపాటు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. వెంటనే ఆ పాటను సినిమాతోపాటు సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే వెంటనే రూ.100 కోట్లు ఇవ్వాలని తేల్చి చెప్పారు. హిందువుల మనోభావాలని ఈ పాట దెబ్బ తీసేలా ఉందని ఆయన ఓ వీడియోలో అన్నారు.

వాళ్లకు దమ్ముంటే ఇతర మతాల వారిని కించపరిచేలా ఇలాంటి పాటలు తీసుకురావాలని సవాలు విసిరారు. కిస్సా 47 అనే ఈ పాట మొదట్లోనే శ్రీనివాస గోవిందా అనే గోవింద నామాలు వినిపిస్తాయి. ఈ పాట ఫిబ్రవరి 26నే యూట్యూబ్ లోకి వచ్చింది. ఇప్పటికే 93 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకూ అటు సంతానంగానీ, ఇటు ప్రొడ్యూసర్స్ గానీ స్పందించలేదు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం