OTT Thriller: ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ - కేరళ, తమిళనాడు సరిహద్దు గొడవలతో...
OTT Action Thriller: కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అలంగు థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో గుణనిధి, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రల్లోనటించారు.
OTT Action Thriller: కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అలంగు థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలంగు మూవీలో గుణనిధి, కాళీ వెంకట్, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఎస్.పి శక్తి వేళ్ దర్శకత్వం వహించాడు.
వాస్తవ ఘటనలతో...
వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన అలంగు మూవీ డిసెంబర్ 27న థియేటర్లలో రిలీజైంది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న గ్రామ ప్రజల మధ్య ఉండే గొడవలు, ప్రాంతీయ భేదాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు శక్తివేళ్ ఈ సినిమాను రూపొందించారు.
థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలోకి ఇరవై రోజుల్లోనే రావడం ఆసక్తికరంగా మారింది. కాన్సెప్ట్, యాక్షన్ ఎపిసోడ్స్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ విజువల్స్‌తో పాటు గుణనిధి, చెంబన్ వినోద్, కాళీ వెంకట్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చాయి.
అలంగు మూవీతోనే గుణనిధి కోలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యాక్షన్ అంశాలతో పాటుగా పెంపుడు జంతువులకు మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గా ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్.
అలంగు కథ ఇదే...
ధర్మ (గుణనిధి) అతడి మరో ఇద్దరు స్నేహితులు పని కోసం తమిళనాడు నుంచి కేరళ వస్తారు. ధర్మ అనాథ. ఓ కుక్కను పెంచుకుంటుంటాడు. అగస్టీన్(చెంబన్ వినోద్ జోస్) కేరళ సరిహద్దు ప్రాంతంలో పేరు మోసిన పొలిటీషియన్. అక్కడ అతడు చెప్పిందే వేదం. అగస్టీన్ కూతురిని కుక్క కరుస్తుంది. ఆ కోపంతో ఆ ఏరియాలో ఉన్న కుక్కలన్నింటిని తన మనుషులతో చంపించేయాలని చూస్తాడు ఆగస్టీన్.
ధర్మ పెంపుడు కుక్కను అగస్టీన్ మనుషులు చంపబోతారు. వారిని ధర్మ కొడతాడు.ఆ తర్వాత ఏమైంది? ధర్మపై అగస్టీన్ పగను పెంచుకోవడానికి కారణమేమిటి? అగస్టీన్ మనుషుల బారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ధర్మ ఏం చేశాడు? అగస్టీన్, ధర్మ మధ్య గొడవ కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఎలాంటి కల్లోలాల్ని సృష్టించింది అన్నదే ఈ మూవీ కథ.
తమిళ్..మలయాళం డైలాగ్స్...
అలంగు మూవీని ప్రయోగాత్మకంగా తెరకెక్కించాడు శక్తివేల్. తమిళం, మలయాళం మిక్స్‌డ్ డైలాగ్స్‌తో ఈ మూవీ సాగుతుంది. కేరళ యాక్టర్స్ మలయాళ డైలాగ్స్ చెప్పగా...కోలీవుడ్ యాక్టర్స్ చేత తమిళ డైలాగ్స్ చెప్పించాడు. అలంగు సినిమాకు అజేష్ మ్యూజిక్ అందించాడు.