ఓటీటీలోకి నయా యాక్షన్ డ్రామా మూవీ.. వాటర్ క్యాన్లలో లిక్కర్, గొడవలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-tamil action drama movie varunan will be streaming on aha tamil from may 1 film plot cast crew and more details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి నయా యాక్షన్ డ్రామా మూవీ.. వాటర్ క్యాన్లలో లిక్కర్, గొడవలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఓటీటీలోకి నయా యాక్షన్ డ్రామా మూవీ.. వాటర్ క్యాన్లలో లిక్కర్, గొడవలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

వరుణన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ తమిళ యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, స్టోరీలైన్ సహా ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీలోకి నయా యాక్షన్ డ్రామా మూవీ.. వాటర్ క్యాన్లలో లిక్కర్, గొడవలు

తమిళ యాక్టర్లు దుష్యంత్ జయప్రకాశ్, గాబ్రియెల్లా కార్ల్‌టన్ ప్రధాన పాత్రలు పోషించిన వరుణన్ చిత్రం ఈ ఏడాది మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి జయవేల్ మురుగన్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్‍లో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ దక్కింది. ఈ వరుణన్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

వరుణన్ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్

వరుణన్ సినిమా మే 1వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. మే 1 చాలా స్పెషల్, వరుణన్ సినిమా ప్రీమియర్ కానుంది అని సోషల్ మీడియాలో ఆహా తమిళ్ పోస్ట్ చేసింది.

వాటర్ సరఫరా చేసే రెండు గ్రూప్‍ల మధ్య గొడవలతో వరుణన్ మూవీ సాగుతుంది. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ మురుగున్. దుష్యంత్, గాబ్రియెల్లాతో పాటు రాధారవి, చరణ్ రాజ్, సత్యరాజ్, శంకర్ నాగ్ విజయన్, హరిప్రియ ఇసై, మహేశ్వరి చాణక్యన్, జీవా రవి, అర్జున్ కీర్తివాసన్ ఈ సినిమాలో కీరోల్స్ చేశారు.

వరుణన్ చిత్రాన్ని కార్తీక్ శ్రీధరన్ ప్రొడ్యూజ్ చేయగా.. బోబో శశి మ్యజిక్ ఇచ్చారు. ఈ మూవీకి శ్రీరామ సంతోష్ సినిమాటోగ్రఫీ చేయగా.. ముత్యన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

వరుణన్ స్టోరీలైన్

నార్త్ చెన్నైలోని జనాలకు నీటిని సరఫరా చేసే రెండు గ్రూప్‍ల మధ్య వరుణన్ స్టోరీ నడుస్తుంది. అయ్యవు (రాధారవి) గ్రూప్‍లో థతిళ్లై (దుష్యంత్), మరుదు (ప్రియదర్శన్) ఉంటారు. వీరు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మరోవైపు జాన్ (చరణ్), అతడి భార్య రాణి (మహేశ్వరి), డబ్బా (శంకర్ నాగ్) కూడా నీటి వ్యాపారం చేస్తుంటారు. అయితే, జాన్ గ్రూప్ నీటితో పాటు క్యాన్‍ల్లో లిక్కర్ బాటిళ్లు అక్రమంగా సరఫరా చేస్తుంటుంది. అక్రమ మద్యం అమ్ముతుంటారు జాన్ గ్రూప్ సభ్యులు. ఈ విషయం తిళ్లైకు తెలియడంతో గొడవ మొదలవుతుంది. రెండు గ్రూప్‍ కొట్లాటలు పెద్దవవుతాయి. అవినీతిపరుడైన ఓ పోలీస్ ఎంట్రీతో సమస్య మరింత తీవ్రమవుతుంది. పైచేయి సాధించేందుకు, గెలిచేందుకు రెండు గ్రూప్‍లు ప్రయత్నిస్తుంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది వరుణన్ మూవీలో ఉంటుంది.

కాగా, తెలుగు సినిమా ‘35 - చిన్న కథ కాదు’ తమిళ డబ్బింగ్‍లో ఆహా తమిళ్ ఓటీటీలో రీసెంట్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చింది. నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ తమిళంలో ‘35 - చిన్న విషయం ఇల్ల’ పేరుతో అడుగుపెట్టింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం