Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ పెళ్లి.. త్వరలోనే గుడ్ న్యూస్
Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ డిసెంబర్ లోనే రానున్నట్లు తెలుస్తోంది.
Tamannah Vijay Wedding: తమన్నా, విజయ్ వర్మ తమ డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోబోతున్నారా? త్వరలోనే ఈ జంట ఏడడుగులూ నడవబోతోందా? ప్రస్తుతం వస్తున్న వార్తలు ఇదే నిజమంటున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లితో ఒక్కటి కావడం సహజమే. ఇప్పుడీ లైన్ లో తమన్నా, విజయ్ ఉన్నారు.

కొన్నాళ్లుగా తమన్నా, విజయ్ డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు తమ రిలేషన్‌షిప్ ను ఎక్కువ కాలం సీక్రెట్ గా కూడా ఉంచలేదు. ఎప్పుడో పబ్లిగ్గా చెప్పేసిన ఈ జంట.. అప్పటి నుంచి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఈ ఏడాది జూన్ లో తమ డేటింగ్ రూమర్స్ నిజమే అని కన్ఫమ్ చేశారు తమన్నా, విజయ్. ఇప్పటికే ఇద్దరూ 30లు దాటేశారు.
ఇక లేట్ చేయకుండా పెళ్లి చేసుకోవడమే బెటరని ఇద్దరూ డిసైడైనట్లు సమాచారం. డిసెంబర్ లోనే వీళ్లు తమ పెళ్లి గురించి అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. నార్త్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చి ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది తమన్నా. ఇటు హైదరాబాద్ లో పుట్టి బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతున్నాడు విజయ్ వర్మ.
ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్ లో ఉన్నారంటూ మొదట్లో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. మిల్కీ బ్యూటీలాంటి తమన్నా.. విలన్ క్యారెక్టర్లు పోషించే విజయ్ తో డేటింగ్ ఏంటనీ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తొలిసారి వీళ్లిద్దరూ గోవాలో న్యూ ఇయర్ పార్టీలో కనిపించారు. అప్పటి నుంచే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. మొత్తానికి ఆరు నెలల తర్వాత వీళ్లు తమ మధ్య బంధాన్ని బయటపెట్టారు.
లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీలో ఈ ఇద్దరూ రెచ్చిపోయి నటించారు. రెండు దశాబ్దాల సినిమా కెరీర్లో ఎప్పుడూ ఘాటు ముద్దు సీన్లు చేయని తమన్నా.. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ కోసం ఆ రూల్ పక్కన పెట్టింది. ఇందులో చాలా బోల్డ్ సీన్ చేసింది. ఇక వీళ్ల డేటింగ్ చాలని, పెళ్లి చేసుకోవాలని ఇద్దరి కుటుంబాల నుంచి ఒత్తిడి వస్తోందట. వచ్చే నెలలో 21వ తేదీన తమన్నా బర్త్ డే జరుపుకుంటోంది. అదే రోజు వీళ్లు తమ పెళ్లి అనౌన్స్‌మెంట్ చేయనున్నట్లు సమాచారం.