తమన్నా హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ గుర్తుందా శీతాకాలం యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. 4కే వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీలో తమన్నాతో పాటు మేఘా ఆకాష్, కావ్య శెట్టి కూడా హీరోయిన్లుగా నటించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించాడు.
2022లో థియేటర్లలో రిలీజైన గుర్తుందా శీతాకాలం మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కన్నడంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లవ్ మాక్‌టైల్ మూవీకి రీమేక్‌గా గుర్తుందా శీతాకాలం తెరకెక్కింది. కన్నడ మ్యాజిక్‌ను తెలుగులో రీక్రియేట్ కాలేదు. ఒక వ్యక్తి జీవితంలోని మూడు ప్రేమకథలు...వాటిలోని మలుపులతో దర్శకుడు నాగశేఖర్ గుర్తుందా శీతాకాలం మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీలో ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. గుర్తుందా శీతాకాలం పరాజయం పాలైన తమన్నా, సత్యదేవ్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి.
దేవ్ (సత్యదేవ్) స్కూల్ డేస్‌లో ప్రేమలో ఓడిపోతాడు. ప్రేమపై నమ్మకం కొల్పోతాడు. కాలేజీలో తనతో పాటు చదివే అమృతను (కావ్యశెట్టి) ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలకంటాడు. అమృత కూడా దేవ్‌ను ఇష్టపడుతుంది. ఆస్తులు, అంతస్థుల తేడాల కారణంగా వారి పెళ్లి జరగదు. దేవ్‌కు బ్రేకప్ చెబుతుంది అమృత. విఫల ప్రేమ బాధలో ఉన్న దేవ్ జీవితంలోకి నిధి (తమన్నా)ఎలా వచ్చింది?
దేవ్‌కు బ్రేకప్ చెప్పిన అమృత మళ్లీ అతడిని వెతుక్కుంటూ ఎందుకొచ్చింది? దేవ్‌కు దివ్య (మేఘా ఆకాష్), ప్రశాంత్( ప్రియదర్శి)లకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ఈ మూవీ కథ. కాన్సెప్ట్ బాగున్నా మూడు ప్రేమకథలను అందంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడటంతో ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
తమన్నా హీరోయిన్‌గా నటించిన ఓదెల 2 మూవీ ఇటీవల రిలీజైంది. మైథలాజికల్ ఫాంటసీ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా ఓదెల 2 రూపొందింది.
సంబంధిత కథనం