Tamanna Bikini: బికినీలో తమన్నా ఊహించని హాట్ షో.. బీచ్‌లో సెక్సీ పిక్ వైరల్-tamannaah sizzles in latest yellow colour bikini at maldives beach ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamannaah Sizzles In Latest Yellow Colour Bikini At Maldives Beach

Tamanna Bikini: బికినీలో తమన్నా ఊహించని హాట్ షో.. బీచ్‌లో సెక్సీ పిక్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Oct 06, 2023 08:48 AM IST

Tamanna Bhatia In Bikini: సౌత్ ఇండియన్ ది మోస్ట్ గ్లామరస్ బ్యూటి తమన్నా భాటియా సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోయే ఈ సుందరి తాజాగా బికినీలో దర్శనం ఇచ్చి ఉఫ్ అనేలా చేసింది.

బికినీలో తమన్నా ఊహించని హాట్ షో.. బీచ్‌లో సెక్సీ పిక్ వైరల్
బికినీలో తమన్నా ఊహించని హాట్ షో.. బీచ్‌లో సెక్సీ పిక్ వైరల్ (Instagram)

సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటి తమన్నా (Tamannaah Bhatia) అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన అందంతో యావత్ తెలుగు యువత మనసు దోచుకుంది. మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాతో మాత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. మధు అనే పాత్రతో యావత్ తెలుగు ప్రేక్షకులు ప్రేమలో పడిపోయారు. అనంతరం తెలుగులో అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకుంది.

ట్రెండింగ్ వార్తలు

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఇటీవల వరుస సినిమా అవకాశాలతో సత్తా చాటుతోంది. చిరంజీవితో భోళా శంకర్, రజనీ కాంత్‌తో జైలర్ సినిమాల్లో నటించిన తమన్నా ఎక్కువగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు చేసింది. బబ్లీ బౌన్సర్ మూవీ తర్వాత అమెజాన్‌ ప్రైమ్ వీడియో సిరీస్ జీ కర్దాలో ఘాటు శృంగార సన్నివేశాలతో ఆకట్టుకుంది మిల్కీ బ్యూటి తమన్నా.

జీ కర్దా తర్వాత వెంటనే లస్ట్ స్టోరీస్ 2 సిరీసులో మరింతగా రెచ్చిపోయు ఇంటిమేట్ సీన్స్ చేసింది తమన్నా భాటియా. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీసులో ప్రియుడు విజయ్ వర్మతో ఘాటు కిస్సింగ్ సీన్లు చేసింది తమన్నా. అందుకోసం ఏకంగా రూ. 7 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ అందాలను ఘాటుగా ప్రదర్శిస్తోంది తమన్నా. నిత్యం సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పోస్ట్ చేసే తమన్నా తాజాగా మరింత సెక్సీగా కనిపించింది.

బీచ్ ఒడ్డున యెల్లో కలర్ బికినీలో తన మిల్కీ అందాలను ఆరబోసింది తమన్నా. ఓవైపు నీలంగా సముద్రపు అందాలు కనువిందు చేస్తుంటే.. మరోవైపు తమన్నా మిల్కీ సొగసు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. మెరుస్తున్న మేనితో అలా ముందుకు నడుస్తున్న తమన్నా అందాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెట్టింట్లో వేడి రాజేసింది. ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం వేదా, అరణ్మనై 4, బాంద్రా సినిమాలతో బిజీగా ఉంది.

యెల్లో కలర్ బికినీలో తమన్నా
యెల్లో కలర్ బికినీలో తమన్నా
WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.