Gurthunda Seethakalam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేసిన గుర్తుందా శీతాకాలం - స్ట్రీమింగ్ ఎందులోనంటే
Gurthunda Seethakalam OTT Release Date: తమన్నా హీరోయిన్‌గా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా శుక్రవారం (నేడు)ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Gurthunda Seethakalam OTT Release Date: సత్యదేవ్ (Satyadev), తమన్నా (Tamannaah) జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేడు)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్‌గా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన గుర్తుందా శీతాకాలం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కన్నడంలో విజయవంతమైన లాక్ మాక్ టైల్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో తమన్నాతో పాటు కావ్యశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు.
గుర్తుందా శీతాకాలం కథేమిటి?
ఓ యువకుడి జీవితంలో మూడు దశల్లో సాగే ప్రేమకథతో దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. దేవ్ (సత్యదేవ్_ స్కూల్ డేస్‌లో ప్రేమలో ఓడిపోతాడు. ప్రేమపై నమ్మకం కొల్పోయిన అతడు కాలేజీలో చదివే రోజుల్లో అమృతను (కావ్యశెట్టి) ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.
అనుకోకుండా అతడితో ప్రేమకు అమృత బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత అతడి జీవితంలోకి నిధి (తమన్నా)ఎలా వచ్చింది? దేవ్‌కు బ్రేకప్ చెప్పిన అమృత తన తప్పును ఎలా తెలుసుకుందన్నదే ఈ సినిమా కథ. పాయింట్ బాగానే ఉన్నా మూడు ప్రేమకథలను అందంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడటంతో ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది.