Tamannaah Jee Karda Web Series: త‌మ‌న్నా బాలీవుడ్ వెబ్‌సిరీస్ జీ క‌ర్దా రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే-tamannaah first bollywood web series jee karda to stream on amazon prime video on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamannaah First Bollywood Web Series Jee Karda To Stream On Amazon Prime Video On This Date

Tamannaah Jee Karda Web Series: త‌మ‌న్నా బాలీవుడ్ వెబ్‌సిరీస్ జీ క‌ర్దా రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 01:18 PM IST

Tamannaah Jee Karda Web Series: త‌మ‌న్నా ఫ‌స్ట్ బాలీవుడ్ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ వెబ్‌సిరీస్ ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

త‌మ‌న్నా జీ క‌ర్దా
త‌మ‌న్నా జీ క‌ర్దా

Tamannaah Jee Karda Web Series: మరో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లోనే బాలీవుడ్‌ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో జీ క‌ర్దా పేరుతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అనౌన్స్ చేశారు. ఫ్రెండ్‌షిప్, ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ సిరీస్ జూన్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్‌కు అరుణిమ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందుతో త‌మ‌న్నాతో పాటు ఆషిమ్ గులాటి, సోహెయిల్ న‌య్య‌ర్‌, అన్యా సింగ్‌, హూస్సేన్ ద‌లాల్‌, న‌య‌న్ బెన‌ర్జీ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ఏడుగురు బాల్య స్నేహితుల జీవితాల నేప‌థ్యంలో జీ క‌ర్దా సిరీస్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. 30 ఏళ్ల వ‌య‌సులోపు జీవితంలో సెటిల్ కావాల‌ని క‌ల‌లు క‌న్న క్లోజ్ ఫ్రెండ్స్‌ జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిర‌గాయి?

తాము చేసిన త‌ప్పుల వ‌ల్ల వారు ఏ విధ‌మైన ఇబ్బందులు ప‌డ్డార‌న్న‌దే ఈ సిరీస్ క‌థ‌. ఇందుతో త‌మ‌న్నా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌న్నా హిందీలో న‌టిస్తోన్న ఫ‌స్ట్ వెబ్ సిరీస్ ఇది. తెలుగులో లెవెన్త్ అవ‌ర్‌తో పాటు త‌మిళంలో నవంబ‌ర్ స్టోరీ అనే వెబ్‌సిరీస్‌లు చేసింది త‌మ‌న్నా.

ప్ర‌జెంట్‌ వెబ్ సిరీస్‌ల‌తో పాటు ద‌క్షిణాదిలో టాప్ హీరోల‌తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది త‌మ‌న్నా. తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న భోళా శంక‌ర్ సినిమా చేస్తోంది త‌మ‌న్నా. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోంది. గురువారం నాటితో జైల‌ర్ సినిమా షూటింగ్ పూర్త‌యింది.

IPL_Entry_Point