ఓటీటీలో తమన్నా సినిమాకు మరింత బూస్ట్.. స్ట్రీమింగ్ వివరాలివే-tamannaah bhatia super natural thriller odela 2 now also streaming in kannada and malayalam on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో తమన్నా సినిమాకు మరింత బూస్ట్.. స్ట్రీమింగ్ వివరాలివే

ఓటీటీలో తమన్నా సినిమాకు మరింత బూస్ట్.. స్ట్రీమింగ్ వివరాలివే

ఓదెల 2 చిత్రం ఎట్టకేలకు మరో రెండు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ముందు ప్రకటించిన విధంగా ఇప్పుడు ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఓటీటీలో ఈ మూవీకి మరింత బూస్ట్ వచ్చేసింది.

ఓటీటీలో తమన్నా సినిమాకు మరింత బూస్ట్.. స్ట్రీమింగ్ వివరాలివే

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన ఓదెల 2 సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. థియేట్రికల్ రన్‍లో ప్లాఫ్ అయినా.. ఓటీటీలో సత్తాచాటుతోంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో రిలీజైంది. సంపత్ నంది కథ, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్లలో నిరాశపరిచింది. అయితే, గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓదెల 2 మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రానికి మరింత బూస్ట్ దక్కింది. అదేంటంటే..

మరో రెండు భాషల్లో..

ఓదెల 2 సినిమా నేడు (మే 17) కన్నడ, మలయాళం వెర్షన్లు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. ఈ సినిమా గత వారం మే 8వ తేదీన ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందు ఐదు భాషలు అని ప్రకటించినా.. ఆరోజున తెలుగుతో పాటు తమిళం, హిందీలోనే స్ట్రీమింగ్‍కు తెచ్చింది ప్రైమ్ వీడియో. దీంతో కన్నడ, మలయాళ వెర్షన్లపై సందిగ్ధత నెలకొంది. అయితే, ఎట్టకేలకు నేడు ఆ రెండు భాషల వెర్షన్లు కూడా వచ్చేశాయి. మొత్తంగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

మరింత జోరు చూపిస్తుందా!

ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓదెల 2 సినిమా సత్తాచాటుతోంది. ఇప్పటికే నేషనల్ వైడ్‍ సినిమాల ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చింది. భారీ వ్యూస్ సాధిస్తోంది. తెలుగు, తమిళం, హిందీకి తోడు ఇప్పుడు కన్నడ, మలయాళం వెర్షన్లు కూడా వచ్చేశాయి. దీంతో ఈ మూవీకి మరింత బూస్ట్ దక్కింది. మరిన్ని రోజులు జోరు చూపేందుకు అవకాశాలు పెరిగాయి.

బాక్సాఫీస్ డిజాస్టర్

ఓదెల 2 సినిమా చాలా అంచనాలతో థియేటర్లలో గత నెల విడుదలైంది. సీక్వెల్ హైప్, సంపత్ నంది కథ, తమన్నా లీడ్ రోల్ చేయడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ డిజాస్టర్ అయింది. సుమారు రూ.25కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.9కోట్ల వసూళ్లనే సాధించింది. ప్లాఫ్‍గా నిలిచింది.

ఓదెల 2 చిత్రంలో భైరవి అనే నాగసాధువుగా తమన్నా నటించారు. దుష్టశక్తి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడే రోల్ చేశారు. ఈ సినిమాలో వశిష్ట ఎన్ సింహా, హెబ్బా పటేల్, వంశీ, నాగ మహేశ్, గగన్ విహారి, సురేందర్ రెడ్డి కీలకపాత్రలు చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ ప్రొడ్యూజ్ చేసిన ఈ సినిమాకు అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం