స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఓదెల 2’ సినిమాపై ఆసక్తి విపరీతంగా ఉంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రానికి సంపత్ నంది కథను అందించటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు సంపత్ నంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది. ఓదెల 2 మూవీ ముందుగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ నేడు వెల్లడించింది.
ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ప్రకటన కోసం మూవీ టీమ్ నేడు (మార్చి 22) ఓ పోస్టర్ రివీల్ చేసింది. తమన్నా ఆభరణాలు ధరించి ఉండగా.. రక్తం చిందిన ముఖం సగమే ఉంది. ముఖం వద్ద మరో సగం వారణాసి నగరం కనిపిస్తోంది. చాలా ఇంటెన్సిటీతో ఈ పోస్టర్ ఉంది. ఇది మరింత క్యూరియాసిటీని పెంచేసింది.
“చీకటి కమ్మేస్తూ.. ఆశ నశిస్తూ ఉంటుందో.. శివశక్తి మేల్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఓదెల 2 ఏప్రిల్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ డివైన్ థ్రిల్లర్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‍లపై చూసేందుకు రెడీగా ఉండండి” అని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో నాగ సాధువుగా ఈ చిత్రం నటిస్తున్నారు.
ఓదెల 2 మూవీకి అజ్నీశ్ లోక్‍నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ పతాకాలపై డి.మధు, సంపత్ నంది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‍ప్లే, మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను కూడా సంపద్ నంది చేస్తున్నారు. అశోక్ తేజ డైరెక్షన్ చేస్తున్నారు.
ఓదెల 2 టీజర్‌ను ఇటీవలే మహా కుంభమేళా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఇంటెన్సిటీతో థ్రిల్లింగ్‍గా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దుష్టశక్తిని అడ్డుకునే శివశక్తి అనే నాగసాధువు పాత్రను తమన్నా చేశారు. శక్తివంతమైన క్యారెక్టర్ చేశారు. ఓదెల రైల్వేస్టేషన్‍లో లీడ్ రోల్ చేసిన హబ్బా పటేల్ ఈ సీక్వెల్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. విశిష్ట సింహ, మురళి శర్మ, శరత్ లోహస్విత, నాగ మహేశ్, గగన్ విహారి కూడా ఈ చిత్రంలో కీరోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ సినిమాకు హైప్ మాత్రం ఎక్కువగానే ఉంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ తొలి వారంలో ట్రైలర్ రిలీజయ్యే అవకాశం ఉంది.
ఓదెల 2 చిత్రానికి ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ధర ఇప్పటికే జరిగిందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సుమారు రూ.11కోట్ల ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అయితే, ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ హక్కులను తీసుకుందో సమాచారం వెల్లడికాలేదు. త్వరలో ఈ విషయం కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం