Tamannaah with Vijay Varma: న్యూ ఇయర్ వెకేషన్‌ నుంచి తిరిగొచ్చిన తమన్నా.. బాయ్‌ఫ్రెండ్‌తో మిల్క్ బ్యూటీ సందడి..!-tamannaah bhatia and vijay varma spotted at mumbai airport after kissing video viral
Telugu News  /  Entertainment  /  Tamannaah Bhatia And Vijay Varma Spotted At Mumbai Airport After Kissing Video Viral
తమన్నా-విజయ్ వర్మ
తమన్నా-విజయ్ వర్మ

Tamannaah with Vijay Varma: న్యూ ఇయర్ వెకేషన్‌ నుంచి తిరిగొచ్చిన తమన్నా.. బాయ్‌ఫ్రెండ్‌తో మిల్క్ బ్యూటీ సందడి..!

04 January 2023, 11:48 ISTMaragani Govardhan
04 January 2023, 11:48 IST

Tamannaah with Vijay Varma: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ముంబయి ఎయిర్‌పోర్టులో సందడి చేశారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

Tamannaah with Vijay Varma: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్క్ బ్యూటీ డేటింగ్‌ చేస్తోందని, వీరిద్దరూ కలిసి ముంబయిలో చెట్టా పట్టాలేసుకుని తిరిగారని వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ వేడుకలను గోవాల జరుపుకున్నారు. ఆ పార్టీలో వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందించారు. ఈ ఘటన తర్వాత తొలిసారి వీరిద్దరూ కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు.

నూతన సంవత్సర వేడుకలను గోవాలో ముగించుకుని ముంబయి ఎయిర్‌పోర్టులో తమన్నా-విజయ్ వర్మ సందడి చేశారు. తమన్నా నలుపు రంగు దుస్తుల్లో మెరవగా.. విజయ్ వైట్ టీషర్ట్ డెనిమ్ జీన్స్‌లో దర్శనమిచ్చారు. వీరిద్దరూ ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాన్ని ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇద్దరూ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు.

వీరి రిలేషన్‌షిప్ గురించి తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను ఓ యూజర్ పోస్ట్ పెట్టగా.. చూసేందుకు వీరి జోడీ చాలా బాగుందని మరొకరు స్పందించారు. ఇద్దరూ ఎంతో అందంగా ఉన్నారని మరొకరు పోస్ట్ పెట్టారు.

తమన్నా గతేడాది వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపింది. తెలుగులో గనీ, ఎఫ్3, గుర్తుందా శీతాకాలంతో పాటు హిందీలో బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ లాంటి సినిమాల్లో మెరిసింది. ఈ ఏడాది నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చూడియాన్ అనే సినిమాలో కనిపించనుంది. విజయ్ వర్మ చివరగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం డార్లింగ్స్‌లో కనిపించాడు. ఆలియా భట్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ ఏడాది సుజుయ్ ఘోష్‌తో ఓ ప్రాజెక్టుకు ప్లాన్ చేశాడు. విజయ్ తెలుగులో నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్‌గా నటించాడు.

సంబంధిత కథనం