Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?-tamannaah aranmanai 4 and vishal rathnam streaming on same day this ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aranmanai 4 - Rathnam Ott: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 16, 2024 12:07 PM IST

Aranmanai 4 - Rathnam OTT: త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4తో పాటు విశాల్ ర‌త్నం సినిమాలు ఒకే రోజు ఓవ‌ర్‌సీస్‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ కానున్నాయంటే?

అరాణ్మ‌ణై 4
అరాణ్మ‌ణై 4

Aranmanai 4 - Rathnam OTT: త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4తో పాటు విశాల్ ర‌త్నం సినిమాలు ఒకే రోజు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. శుక్ర‌వారం ఈ రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోన్నాయి. అయితే ఇండియ‌న్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కాదు. ఇంథుస‌న్ ఓవ‌ర్‌సీస్ ఓటీటీలో శుక్ర‌వారం ఈసినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇంథుస‌న్ ఓటీటీలో ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ రెండు సినిమాల‌ను చూడొచ్చు.

జీ5లో అరాణ్మ‌ణై 4

ఈ త‌మిళ మూవీస్ ఇండియ‌న్ ఓటీటీలో త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. త‌మ‌న్నా, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టించిన అరాణ్మ‌ణై 4 ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకున్న‌ది. మే 31న ఈ హార‌ర్ మూవీ జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

విశాల్ ర‌త్నం ఓటీటీ ఇదే...

విశాల్ ర‌త్నం ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మే 24న ఈ యాక్ష‌న్‌మూవీ అమెజాన్‌లో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ర‌త్నం ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

యాభై కోట్ల క‌లెక్ష‌న్స్‌...

అరాణ్మ‌ణై 4 మూవీకి సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఇందులో లీడ్ రోల్‌లో న‌టించాడు. ప‌ద‌మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 50 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఈ ఏడాది త‌మిళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. అరాణ్మ‌ణై 4లో త‌మ‌న్నా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తెలుగులో మాత్రం బాక్ పేరుతో డ‌బ్ అయిన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

అరాణ్మ‌ణై క‌థ ఇదే...

శివాని (త‌మ‌న్నా) పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ‌వివాహం చేసుకుంటుంది. అనూహ్య ప‌రిస్థితుల్లో శివానితో పాటు ఆమె భ‌ర్త కూడా చ‌నిపోతాడు. ఈ హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని లాయ‌ర్ శివ‌శంక‌ర్‌తో(సుంద‌ర్ సి) పాటు డాక్ట‌ర్ మాయ (రాశీఖ‌న్నా) ఎలా రివీల్ చేశార‌న్న‌ది ఈ మూవీ క‌థ‌. అరాణ్మ‌ణై సిరీస్‌లో వ‌చ్చిన నాలుగో మూవీ ఇది.

తెలుగు, హిందీ భాష‌ల్లో త‌మ‌న్నాకు ల‌క్ క‌లిసిరాక‌పోయినా త‌మిళంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. జైల‌ర్‌తో ఇండ‌స్ట్రీ హిట్‌ను అందుకున్న త‌మ‌న్నా...తాజాగా అరాణ్మ‌ణై 4తో ఈ స‌క్సెస్ ప‌రంప‌ర‌ను కంటిన్యూ చేసింది.

క‌లిసిరాని ర‌త్నం...

ర‌త్నం మూవీ విశాల్‌కు మాత్రం చేదు ఫ‌లితాన్నే మిగిల్చింది. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు హ‌రి తెర‌కెక్కించిన ఈ మూవీ క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. ఈ సినిమా ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిచింది. ర‌త్నం సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు.

ర‌త్నం క‌థ ఇదే...

ప‌న్నీర్ (స‌ముద్ర‌ఖ‌ని) అనే ఎమ్మెల్యేకు న‌మ్మిన‌బంటుగా ప‌నిచేస్తుంటాడు ర‌త్నం (విశాల్‌). అత‌డి కోసం ఓ వ్య‌క్తిని చంపి జైలుకు వెళ‌తాడు. మ‌ల్లిక అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ర‌త్నం. ఆమెను చంప‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు? శ‌త్రువ‌ల‌ బారి నుంచి మ‌ల్లిక‌ను (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) ర‌త్నం ఎలా కాపాడాడు? మ‌ల్లిక‌ను చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ది ఎవ‌రు? అనే క‌థాంశంతో ద‌ర్శ‌కుడు హ‌రి ఈ మూవీని తెర‌కెక్కించాడు. యాక్ష‌న్ ఎపిసోడ్సతో పాటు విశాల్ యాక్టింగ్ బాగుంద‌నే పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం మూవీ నిర్మాత‌ల‌కు న‌స్టాల‌నే మిగిల్చింది.

Whats_app_banner