తమన్నా నటించిన మూవీ ఓదెల 2. ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే గత శుక్రవారం (మే 9) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన తర్వాత మాత్రం దుమ్ము రేపుతోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.
తమన్నా నటించిన ఓదెల 2 మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాను మేకర్స్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేసినా.. ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. హిట్ మూవీ ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్ గా వచ్చినా.. ఈ ఓదెల 2 అంతగా ప్రభావం చూపలేకపోయింది. సంపత్ నంది కథ అందించిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సొంతం చేసుకుంది.
ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంది. నంబర్ వన్ స్థానంలోకి కూడా వెళ్లినా.. మళ్లీ రెండోస్థానానికి పడిపోయింది. అయితే ఇప్పటికీ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. నాగసాధుగా ఈ సినిమాలో తమన్నా కనిపించడం విశేషం.
ఓదెల 2 మూవీలో తమన్నాతోపాటు హెబ్బా పటేల్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్లు నటించారు. సంపత్ నంది కథ అందించగా.. అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు. మైథలాజికల్, హారర్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లయిన ఆడవాళ్లను పాశవికంగా అనుభవించే ఓ సైకో చచ్చిన తర్వాత ప్రేతాత్మగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఓదెల 2ను తెరకెక్కించారు.
భార్య చేతుల్లో చనిపోయిన తిరుపతి ఎలా ప్రేతాత్మగా మారాడు, ఆ తర్వాత ఎలాంటి దారుణాలు చేశాడు, దాని వల్ల ఊరి ప్రజలు పడిన ఇబ్బందులతో సినిమా ఫస్టాఫ్ సాగుతుంది. నాగ సాధువుగా తమన్నా ఎంట్రీతో సినిమాలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆడియెన్స్‌ను అబ్బురపరుస్తాయి.
సంబంధిత కథనం