Tamanna: చరిత్ర సృష్టించిన తమన్నా.. భారత్‌లో తొలి హీరోయిన్‌గా? శృంగార సీన్లే కారణం!-tamanna indian brand ambassador for shiseido cosmetics of japan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamanna: చరిత్ర సృష్టించిన తమన్నా.. భారత్‌లో తొలి హీరోయిన్‌గా? శృంగార సీన్లే కారణం!

Tamanna: చరిత్ర సృష్టించిన తమన్నా.. భారత్‌లో తొలి హీరోయిన్‌గా? శృంగార సీన్లే కారణం!

Sanjiv Kumar HT Telugu
Oct 13, 2023 01:38 PM IST

Tamanna Shiseido Cosmetics: సౌత్ ఇండియా మిల్కీ బ్యూటి తమన్నా కాస్మోటిక్ రంగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏ భారతీయ హీరోయిన్ అందుకోని అరుదైన గౌరవం అందుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

చరిత్ర సృష్టించిన తమన్నా.. భారత్‌లో తొలి హీరోయిన్‌గా? శృంగార సీన్లే కారణం!
చరిత్ర సృష్టించిన తమన్నా.. భారత్‌లో తొలి హీరోయిన్‌గా? శృంగార సీన్లే కారణం! (Instagram)

సౌత్ సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుని మోస్ట్ సక్సెస్‍ఫుల్ స్టార్ హీరోయిన్‍గా దూసుకుపోతోంది తమన్నా భాటియా (Tamannaah Bhatia). హ్యాపీడేస్ సినిమాతో తెలుగు యువత గుండెల్లో చిచ్చు పెట్టిన ఈ మిల్కీ బ్యూటి ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలు, వెబ్ సిరీసులతో తెగ బిజీగా ఉంది. ఇటీవలే జైలర్, భోళా శంకర్ మూవీస్‍తోపాటు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసులతో తెగ ట్రెండ్ అయింది. ఇదే కాకుండా ఆఖరి సచ్ అనే మరో వెబ్ సిరీస్‍తోనూ ఓటీటీలో సందడి చేస్తోంది.

ఇదిలా ఉంటే భారత్‌లో కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ధి సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదికలో ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ నుంచి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మోటిక్ ప్రోడక్ట్స్ కొన్నారు. దీంతో కాస్మోటిక్స్ సంస్థలు రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని వెనుక వేశాయి. ఇలా బ్యూటి ఉత్పత్తుల కోసం మహిళలు సగటున రూ. 1, 214 ఖర్చు చేయగా.. అందులో దాదాపుగా 40 శాతం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినవే అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

ఇలాంటి సమయంలో భారతీయ మహిళలను ఆకట్టుకునేందుకు స్టార్ హీరోయిన్లలు తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు. ఇటీవల వెబ్ సిరీసుల్లో శృంగార సీన్లతో తమన్నా బాగా వైరల్ అయింది. దీంతో తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే భారత్‌ నుంచి ఇప్పటివరకు ఏ హీరోయిన్ షిసిడోకు ప్రచారకర్తగా చేయలేదని సమాచారం.

కాగా షిసిడో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై తమన్నా సంతోషం వ్యక్తం చేసింది. చాలా ఆశ్చర్యంగా ఉందంటూ పేర్కొంది. ఇక షిసిడో 100 ఏళ్లకుపైగా కాస్మోటిక్ రంగంలో అగ్రగామిగా షిసిడో కొనసాగుతోంది. తమన్నా-షిసిడో ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ తోపాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడుతుందని షిసిడో భావిస్తోంది.

Whats_app_banner