Tamanna About Sharwanand In Odela 2 Pre Release Event: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది తమన్నా భాటియా. మిల్కీ బ్యూటి తమన్నా చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన సినిమా ఓదెల 2. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ ఓదెల 2 సినిమాకు దర్శకత్వం వహించారు.
రీసెంట్‌గా హైదరబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా యంగ్ హీరో శర్వానంద్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నా భాటియా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా ఏప్రిల్ 17న పాన్ ఇండియాగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. తప్పకుండా వెళ్లి చూడండి. ఈ సినిమా సంపత్ గారు మధు గారి కోసం గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను" అని చెప్పింది.
"20 ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్‌లో పనిచేశాను. కానీ, ఇంత పాషన్ ఉన్న ప్రొడ్యూసర్, క్రియేటర్స్ చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శివశక్తి పాత్ర, ఈ సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. ఏప్రిల్ 17 కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను" అని తమన్నా మనసులో మాట బయటపెట్టింది.
"మధుగారు ఈ సినిమాని చాలా అద్భుతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించారు. ప్రతి ప్రమోషన్ మెమోరబుల్‌గా చేశారు. ఈ ఈవెంట్ కొచ్చి మమ్మల్ని విష్ చేసిన హీరో శర్వానంద్ గారికి థాంక్యూ. శర్వానంద్, నేను ఎప్పుడూ మీట్ కాలేదు. కానీ, ఆయనతో కలిసి నటించాలనుంది" అని శర్వానంద్‌పై హీరోయిన్ తమన్నా కామెంట్స్ చేసింది.
"శివశక్తి పాత్రను నాకు ఇచ్చినందుకు సంపత్ నంది, అశోక్ తేజకు కృతజ్ఞతలు. వశిష్ఠ అద్భుతంగా నటించారు. అజినిస్ గారు ఈ సినిమాకి సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను" అని తమన్నా భాటియా తన స్పీచ్ ముగించింది.
ఇదే ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ రాధా మోహన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఓదెల రైల్వే స్టేషన్ నా ప్రొడక్షన్. ఓదెల 2 మధు గారు కంటిన్యూ చేశారు. మూడో పార్ట్ ఏమవుతుందో తర్వాత చెప్తాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు నాకు సుపరిచితం. వారందరికీ నా బెస్ట్ విషెస్" అని అన్నారు.
"సంపత్ నంది గారితో లాంగ్ జర్నీ. నెక్ట్స్ సినిమా కూడా ఆయనతోనే చేస్తున్నాను. ఓదెల 2 కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. ఈ ట్రెండ్‌కి తగ్గ సినిమా ఇది. ఆడియన్స్ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నా దృడ విశ్వాసం. ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేయగలరు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం" అని నిర్మాత రాధా మోహన్ తెలిపారు.
సంబంధిత కథనం