Tamanna Changed Clothes On Road While Movie Shooting: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన తమన్నా భాటియా హ్యాపీడేస్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
హ్యాపీడేస్ సినిమాలో మధుగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది తమన్నా. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఐదేళ్లకు తమన్నా తమిళ స్టార్ హీరో కార్తీ సరసన అవారా సినిమా చేసింది. అవారా సినిమా ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే.
ఇప్పటికీ ఆవారా మూవీ పాటలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే, అలాంటి అవారా సినిమాలో మొదటగా తమన్నాకు బదులు హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్‌గా పిలవబడే నయనతారను మేకర్స్ అనుకున్నారట. కానీ, అప్పటికే స్టార్ హీరోయిన్ అయిన నయనతార ఆ సినిమా చేయాలంటే దర్శకనిర్మాతలకు చాలా కండిషన్స్ పెట్టిందట.
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆవారాలో రోడ్ మీద, హైవేలపైనే ఎక్కువ సీన్స్ ఉంటాయి. కాబట్టి, వాటిని రోడ్, హైవేలపైన షూటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, నయనతార మాత్రం తనకు కాస్ట్‌లీ హోటల్స్‌లో స్టే కావాలి, క్యారవాన్స్ కావాలని డిమాండ్ పెట్టిందట. ఇది రోడ్ షూటింగ్ ఫిల్మ్ అని, అలాంటివన్నీ కల్పించలేం అని దర్శకనిర్మాతలు తెలిపారట.
హోటల్స్‌లో స్టే చేస్తూ ఉంటే షూటింగ్‌కు బాగా ఖర్చు అవుతుందని నయనతార స్థానంలో తమన్నాను హీరోయిన్‌గా తీసుకున్నారట ఆవారా మూవీ మేకర్స్. ఇక తమన్నా మాత్రం వారిని ఏమాత్రం నిరాశపర్చలేదని, రోడ్డు మీదే బట్టలు మార్చుకునేదని ఓ ఇంటర్వ్యూలో ఆవారా డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు.
నడిరోడ్డు మీద మూవీ టీమ్ వాళ్లు తమన్నా చుట్టూ మూడు చీరలతో గోడ కట్టేవారట. ఆ గోడల మధ్యలో కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని మూవీ షాట్స్‌కు రెడీ అయ్యేదట తమన్నా. ఆ రేంజ్‌లో తమన్నా కోపరేషన్ ఉండేదని ఇంటర్వ్యూలో డైరెక్టర్ లింగుస్వామి వెల్లడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమన్నా ఎంత గ్రేట్ అంటూ కామెంట్స్ చేశారు.
అయితే, గతంలోని ఈ వీడియోలోని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, తమన్నా ఓటీటీ వెబ్ సిరీస్‌లలో నటించి బోల్డ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం చాలా కాలం గ్యాప్ తర్వాత తమన్నా చేస్తున్న తెలుగు మూవీ ఓదెల 2. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించారు.
ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలో తమన్నాతోపాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళి శర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు.
సంబంధిత కథనం