Tabu Beauty Secret: తన చర్మ సౌందర్యానికి రహస్యమేంటో చెప్పేసిన టబు.. రూ.50 వేల క్రీమ్ వాడిందట-tabu jokes she once bought cream worth 50k and never do it again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tabu Jokes She Once Bought Cream Worth 50k And Never Do It Again

Tabu Beauty Secret: తన చర్మ సౌందర్యానికి రహస్యమేంటో చెప్పేసిన టబు.. రూ.50 వేల క్రీమ్ వాడిందట

Maragani Govardhan HT Telugu
Sep 23, 2022 05:03 PM IST

Tabu About her skincare: బాలీవుడ్ నటి టబు(Tabu) తన చర్మ సౌందర్యానికి రహస్యమేంటో చెప్పేసింది. తను జీవితంలో ఒకే ఒక్కసారి రూ.50 వేల విలువ కలిగిన ఫేస్ క్రీమ్ వాడానని స్పష్టం చేసింది. ఆ తర్వాత లేదని బదులిచ్చింది.

టబు అందం రహస్యం
టబు అందం రహస్యం (HT)

Tabu Reveals her skincare secret: ప్రముఖ బాలీవుడ్ నటి టబు.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది భూల్ భూలియా 2 చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకుంది. ఐదు పదుల వయస్సు దాటినా ఈమె అందం ఏ మాత్రం తగ్గలేదు. తన అందం, గ్లామర్‌తో ఇప్పటికీ నేటితరం హీరోయిన్లకు సవాలు విసురుతూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు తన అందం గురించి ఆసక్తిర విషయాలను తెలియజేసింది. తన చర్మ సౌందర్యం కోసం ప్రత్యేకంగా ఏమి వాడనని, తన జీవితంలో ఒకే ఒక్కసారి అందం కోసం క్రీమ్ కొనుగోలు చేశానని స్పష్టం చేశారు.

"నా అందానికి ఎలాంటి సీక్రెట్ లేదు. మిథాలీ అని నా మేకప్ ఆర్టిస్ట్ మేడమ్ మీ చర్మ చూడటానికి చాలా అందంగా ఉంది, ఏమైనా హోమ్ రెమెడీ వాడుతున్నారా? అని ప్రశ్నించింది. కాఫీ పెట్టేదాన్ని అని బదులిచ్చాను. మేడం అలా చేయవద్దు.. మీరు ఓ క్రీమ్ వాడండి. దాని ఖరీదు రూ.50 వేలు అని చెప్పింది. తను చెప్పింది కదాని ఒక్కసారి ఆ క్రీమ్‌ను కొనుగోలు చేశాను. ఇక అంతే.. తర్వాత దాన్ని జీవితంలో వాడలేదు." అని టబు తెలిపారు.

తన చర్మ సౌందర్యానికి వారసత్వంగా కుటుంబం నుంచి వచ్చిందనే తను భావిస్తున్నానని టబు స్పష్టం చేశారు. "నా ముఖం అందంగా ఉండటం కోసం ప్రత్యేకంగా నేనేమి చేయలేదు. అయితే మెరుగ్గా కనిపించడానికి ఏం చేయాలో నాకు తెలుసు, అంతేకానీ ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. నటులు కాకపోయినా.. అందరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా, మానసికంగా ఉండాలని అనుకుంటారు. అలాగే నేను కూడా అందుకోసం నా వంతు ప్రయత్నం చేస్తాను." అని టబు స్పష్టం చేశారు.

టబు ఈ ఏడాది భూల్ భూలియా 2 చిత్రంతో సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీని తర్వాత విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఖుఫియా అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో విశాల్ తనయుడు అస్మాన్‌తో కలిసి నటించనుంది. ఇది ఆమె చేయబోతున్న మొదటి స్పై థ్రిల్లర్ చిత్రం. అలీ ఫైజల్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్