Taapsee luxury life Style: తాప్సీ లగ్జరీ లైఫ్ స్టైల్.. డైటిషియన్‌కే లక్షల్లో ఇస్తోంది..!-taapsee pannu spends 1 lakh per month on her dietician ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Taapsee Pannu Spends 1 Lakh Per Month On Her Dietician

Taapsee luxury life Style: తాప్సీ లగ్జరీ లైఫ్ స్టైల్.. డైటిషియన్‌కే లక్షల్లో ఇస్తోంది..!

Maragani Govardhan HT Telugu
Mar 17, 2023 10:26 PM IST

Taapsee luxury life Style: హీరోయిన్లంటేనే లగ్జరీ లైఫ్ స్టైల్‌తో మెయింటేయిన్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహారం విషయంలో, ఫిట్నెస్ పరంగా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ప్రముఖ స్టార్ హీరోయిన్ తాప్సీ తన డైటిషియన్‌కు లక్షల్లో డబ్బు చెల్లిస్తోందట.

తాప్సీ పన్ను
తాప్సీ పన్ను (Sandip Mahankal)

Taapsee luxury life Style: సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వారు ఫుడ్ సీక్రెట్లు, వారు వాడే బ్రాండెడ్ వస్తువుల గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఆహారపు అలవాట్ల విషయంలో సాధారణ ప్రజల కంటే వారిది చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు డైటిషియన్లను కూడా నియమించుకుంటారు. ఇందుకోసం వారు భారీగా డబ్బును కూడా ఖర్చు పెడుతుంటారు. అయితే ఆ ఖర్చు లక్షల్లో అంటే ఆశ్చర్యపోక మానరు. తాజాగా ప్రముఖ స్టార్ హీరోయిన్ తాప్సీ తన డైటిషియన్ కోసం ఖర్చు పెట్టే మొత్తం గురించి వివరించింది.

ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగా తన డైటిషియన్‌ ఖర్చు గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ.. "హీరోయిన్‌గా ఉండాలంటే డబ్బు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను చేసే సినిమాను బట్టి నా శరీరాకృతిని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మార్పు వస్తుంది." అని తాప్సీ తెలిపింది.

"ఫిట్‌గా ఉండాలంటే ప్రాంతం, దేశం బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో డైటిషియన్స్ సలహా ఇస్తుంటారు. ఫిట్‌గా ఉండేందుకు ఆహార నియమాలు, అలవాట్ల గురించి సూచనల కోసం డైటిషియన్‌ను నియమిచుకున్నారు. ఆమెకు నెలకు లక్ష రూపాయలు ఇస్తాను. ఈ వృత్తిలో ఉండాలంటే అంత మొత్తం చెల్లించక తప్పదు." అని తాప్సీ తెలిపింది.

తన డైటిషియన్ కోసమే కాకుండా తన తల్లి డైటిషియన్‌కు కూడా తనే డబ్బు చెల్లిస్తుందట. ఈ విషయాన్ని కూడా తాప్సీనే వెల్లడించింది. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం తన తండ్రికి ఇష్ట ఉండదట. ఇప్పటికే తాప్సీ తన మెయింటేనెన్స్ కోసం లక్షల్లో ఖర్చు పెట్టడం చూసి ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. ఒక్క డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తుంటే.. మిగిలిన మెయింటనెన్స్‌కు ఇంకెంత ఖర్చు పెడుుతుందో అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్