OTT Trending: ఓటీటీలో దంచికొడుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. రిలీజైన 5 భాషల్లో ట్రెండింగ్.. తెలుగులో టాప్ 1 ప్లేస్!-sweetheart ott streaming and trending in 5 languages on disney plus hotstar romantic comedy movie sweetheart ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Trending: ఓటీటీలో దంచికొడుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. రిలీజైన 5 భాషల్లో ట్రెండింగ్.. తెలుగులో టాప్ 1 ప్లేస్!

OTT Trending: ఓటీటీలో దంచికొడుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. రిలీజైన 5 భాషల్లో ట్రెండింగ్.. తెలుగులో టాప్ 1 ప్లేస్!

Sanjiv Kumar HT Telugu

Sweetheart OTT Streaming And Trending In 5 Languages: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ మూవీ స్వీట్ హార్ట్ దంచికొడుతోంది. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన స్వీట్ హార్ట్ అన్నింట్లో టాప్‌లో దూసుకుపోతోంది. మరి స్వీట్ హాట్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ వివరాలపై లుక్కేద్దాం.

ఓటీటీలో దంచికొడుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. రిలీజైన 5 భాషల్లో ట్రెండింగ్.. తెలుగులో టాప్ 1 ప్లేస్!

weetheart OTT Release And Trending In 5 Languages: థియేటర్లలో బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్న ఓటీటీలో కొన్ని సినిమాలు మంచి ఆదరణ అందుకుంటాయి. థియేటర్ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఓటీటీ రెస్పాన్స్‌కు కొన్నిసార్లు తేడా భారీగా ఉంటుంది.

థియేటర్లలో ఫెయిల్యూర్

ఇప్పుడు అదే రిపీట్ అయింది. తమిళంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన స్వీట్ హార్ట్ మూవీ థియేటర్లలో విడుదలై పరాజయం పాలైంది. తమిళనాట మార్చి 14న థియేటర్లలో విడుదలైన స్వీట్ హార్ట్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

పడిపోయిన ఐఎమ్‌డీబీ రేటింగ్

కానీ, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ సాధించుకుంది. ఇదే రేటింగ్ మాత్రం ఇప్పుడు మారిపోయింది. ప్రస్తుతం నేడు (ఏప్రిల్ 20) స్వీట్ హార్ట్ సినిమాకు ఐఎమ్‌డీబీలో 10కి 5.6 రేటింగ్‌కు పడిపోయింది. మరి ఇలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలో దంచి కొడుతోంది. ఓటీటీలోకి ఐదు భాషల్లో వచ్చిన స్వీట్ హాట్ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

స్వీట్ హార్ట్ ఓటీటీ రిలీజ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్వీట్ హార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 11న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్వీట్ హార్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి తొమ్మిది రోజులు కావొస్తున్న ఇంకా టాప్ ట్రెండింగ్‌లో ప్రసారం అవుతోంది స్వీట్ హార్ట్.

మూడింట్లో టాప్ 1లో ట్రెండింగ్

జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఇండియాలోని అన్ని భాషల్లో స్వీట్ హార్ట్ టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో నిలిచింది. అలాగే, తెలుగు భాషలో కూడా స్వీట్ హార్ట్ టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇక సొంత లాంగ్వేజ్ అయిన తమిళంలో కూడా నెంబర్ వన్ ప్లేసులో ట్రెండింగ్‌లో ఉంది. ఇలా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో కలిపి, తెలుగు, తమిళంలో టాప్ 1 స్థానంలో స్వీట్ హార్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది.

5 కోట్ల బడ్జెట్‌కు 1.2 కోట్ల కలెక్షన్స్

హిందీ భాషలో అయితే టాప్ 10 స్థానంలో, మలయాళంలో టాప్ 4, కన్నడలో టాప్‌లో స్వీట్ హార్ట్ ట్రెండింగ్‌లో ఉండి సత్తా చాటుతోంది. రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన స్వీట్ హార్ట్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే వసూలు చేసి ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోవడం విశేషంగా మారింది.

స్వీట్ హార్ట్ తారాగణం

ఇదిలా ఉంటే, స్వీట్ హార్ట్ సినిమాకు స్వినీత్ ఎస్ కుమార్ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఇక స్వీట్ హార్ట్ మూవీలో రియో రాజ్, గోపిక రమేష్ హీరో హీరోయిన్‌గా నటించారు. అలాగే, ఈ సినిమాలో కమెడియన్ రెదిన్ కింగ్స్‌లీ, తులసి, రెంజీ పనికర్, అరుణాచలేశ్వరన్, అరుళ్‌నితి శశికుమార్, సురేష్ చక్రవర్తి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం