Suzhal The Vortex 2 Web Series Review In Telugu: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన సుడల్ ది వొర్టెక్స్ మంచి హిట్ అందుకుంది. 2022లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌లో సంక్రాంతికి వస్తున్నా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. ఆ ఏడాది ఈ సిరీస్‌పై ప్రశంసలు కురిశాయి. దీంతో సుడల్ సీజన్ 2పై అంచనాలు పెరిగాయి.
తాజాగా ఇవాళ అమెజాన్ ప్రైమ్‌లోకి సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుడల్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. మంచి క్రియేటర్స్‌గా పేరు తెచ్చుకున్న పుష్కర్-గాయత్రి మరోసారి రూపొందించిన ఈ సిరీస్ రెండో సీజన్ ఎలా ఉందో సుడల్ ది వొర్టెక్స్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2
నటీనటులు: ఐశ్వర్య రాజేష్, కథిర్, లాల్, శరవణన్, శ్రియా రెడ్డి, గౌరీ జి కిషన్, చాందిని తమిళరసన్, సంయుక్త విశ్వనాథన్, మంజిమా మోహన్, అశ్విని నంబియార్, మోనిషా బ్లెస్సీ, నిఖిలా శంకర్ తదితరులు
క్రియేటర్స్: పుష్కర్, గాయత్రి
దర్శకత్వం: బ్రహ్మ, సర్జున్ కేఎమ్
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: అబ్రహం జోసెఫ్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
ఓటీటీ రిలీజ్ డేట్: 28 ఫిబ్రవరి, 2025
ఎపిసోడ్స్: 8 (సుమారుగా 40 - 50 నిమిషాల రన్‌టైమ్)
సుడల్ సీజన్ 1లో తన చెల్లిని చంపినవాడిని హత్య చేసినందుకు నందిని జైలులో ఉంటుంది. సీజన్ 2 కాళీపట్నంలో ప్రారంభం అవుతుంది. దాంతో ఎస్సై చక్రవర్తి (కథిర్)కి తండ్రిలాంటి వాడు అయిన లాయర్ చెల్లప్ప (లాల్) నందిని కేసు వాదించడానికి ఒప్పుకుంటాడు. అయితే, అనుకోకుండా తన ఇంట్లో చెల్లప్ప హత్యకు గురి అవుతాడు. చెల్లప్ప ఇంట్లో ముత్తు (గౌరీ జి కిషన్) హత్యాయుధంతో పోలీసులకు దొరుకుతుంది.
దాంతో ముత్తును ఎస్సై చక్రవర్తి అరెస్ట్ చేస్తాడు. కానీ, చెల్లప్పను హత్య చేసినట్లు మరో ఏడుగురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోతారు. ఆ తర్వాత ఏమైంది? ఎందుకు ఆ అమ్మాయులు లాయర్‌ను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు? లాయర్ చెల్లప్పకు ఆ యువతులకు ఉన్న సంబంధం ఏంటీ? ఎస్సై చక్రవర్తి కనిపెట్టిన నిజాలు ఏంటీ? మరోవైపు హత్య కేసు నుంచి నందిని బయటపడగలిగిందా? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే? సుడల్ ది వోర్టెక్స్ సీజన్ 2 చూడాల్సిందే.
ప్రియుడితో లేచిపోతున్న చెల్లిన చంపిన వ్యక్తిని ఎస్సై చక్రవర్తి సర్వీస్ రివాల్వర్‌తో హత్య చేసిన నందినితో సీజన్ 2 ప్రారంభం అవుతుంది. తనే ప్రతీకారం తీర్చుకున్నట్లు లొంగిపోతుంది. అయితే, మొదటి సీజన్‌కు కొనసాగింపుగా సీజన్ 2 ప్రారంభమైన ఇందులో కొత్త కేస్‌ను పరిష్కరించే నేపథ్యంలో సాగుతుంది. నందిని కేసు వాదించి బయటక తీసుకొస్తాడనుకున్న లాయర్ చెల్లప్ప మర్డర్ ఊహించని ట్విస్టుతో సరికొత్త టర్న్ తీసుకుంటుంది.
ఆ తర్వాత 8 అమ్మాయిలు అనుమానితులుగా ఉండటం, వారి నేపథ్యం, లాయర్‌కు వారికి ఉన్న సంబంధం, వారు నేరం ఒప్పుకోడానికి గల కారణం వంటి విషయాలను దర్యాప్తు చేయడంతో సిరీస్ సాగుతుంది. అష్టకాళి కాన్సెప్ట్, అమ్మాయిల డీటెలియింగ్, స్క్రీన్ ప్లే, నెరేషన్ అంతా గ్రిప్పింగ్‌గా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
పుష్కర్ అండ్ గాయత్రి మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు. అయితే, ట్విస్టులు రివీల్ అయ్యాక ఇదివరకు తెలిసిన స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఎంగేజ్ చేసే విధానం మాత్రం అదిరిపోతుంది. మొదటి 5 ఎపిసోడ్స్ వరకు మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నెరేషన్ డ్రాప్ అవుతుంది. 8వ ఎపిసోడ్ ఒక క్లోజర్‌గా మాత్రమే ఉంటుంది.
ఈ సెకండ్ సీజన్‌లో ట్విస్టులు, మలుపులు మాత్రం ఊహించని విధంగా చాలా బాగా థ్రిల్ చేస్తాయి. కొన్ని పోర్షన్స్ బాగా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సామ్ సీఎస్ బీజీఎమ్ సస్పెన్స్‌కు కావాల్సిన మూడ్‌ను చాలా బాగా క్రియేట్ చేశాయి. అక్కడక్కడ వచ్చే పాటలు కూడా ఆకట్టుకుంటాయి. డైరెక్టర్స్ కూడా తమ బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు.
ఇక ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. వాటిలో ప్రతి ఒక్కరు జీవించేశారు. ఐశ్వర్య రాజేష్‌కు మరో మంచి రోల్ పడింది. ఎస్సైగా కథిర్ డీసెంట్ పర్ఫామెన్స్. సస్పెక్ట్స్‌గా నటించినవాళ్లలో దాదాపుగా చాలా మంది తెలుగులో హీరోయిన్స్‌గా చేశారు.
గౌరీ కిషన్ (96, శ్రీదేవి శోభన్ బాబు ఫేమ్), చాందిని తమిళరసన్ (బుజ్జి ఇలా రా ఫేమ్), సంయుక్త విశ్వనాథన్ (చారి 111 ఫేమ్), మంజిమా మోహన్ (సాహసం శ్వాసగా సాగిపో ఫేమ్)తో పాటు మిగతా వారంతా నటనతో ఆకట్టుకున్నారు. సుడల్ సీజన్ 1 నచ్చిన వారికి సీజన్ 2 కూడా మంచి హై ఇస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్సి ఇష్టపడే వారికి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సుడల్ ది వొర్టెక్స్ 2 మంచి థ్రిల్ ఇస్తుంది.
సంబంధిత కథనం