Surya S/O Krishnan: డబ్బింగ్ మూవీ రీ-రిలీజ్‍కు తెలుగులో భారీ క్రేజ్.. థియేటర్లలో సూర్య ఫ్యాన్స్ హంగామా: వీడియోలు
Surya S/O Krishnan Re-Release: సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ అయింది. సూర్య అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
Surya S/O Krishnan Re-Release: తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రక్తచరిత్ర-2 మినహా డైరెక్ట్ తెలుగు మూవీ ఏదీ చేయలేదు సూర్య. ఇప్పటి వరకు సూర్య అన్ని సినిమాలు తమిళంలో రూపొంది.. తెలుగులో డబ్బింగ్‍లో రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ చిత్రాలే అయినా.. సూర్య నటించిన చాలా సినిమాలు తెలుగులో బ్లాక్‍బాస్టర్లుగా నిలిచాయి. చాలాసార్లు టాలీవుడ్ స్టార్ హీరోల మూవీలతో పోటీ పడ్డాయి. అంతలా తెలుగులో సూర్యకు క్రేజ్ ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి రుజువైంది.
సూర్య హీరోగా నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నేడు (ఆగస్టు 4) థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. 15 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా రీ-రిలీజ్‍కు మంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు కొన్ని థియేటర్లలో బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. డబ్బింగ్ మూవీ రీ-రిలీజ్‍కు ఈ స్థాయిలో క్రేజ్ ఉండడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక, సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో సూర్య అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. జోష్ ప్రదర్శిస్తున్నారు.
సూర్య ఫ్యాన్స్ థియేటర్లలోనే డ్యాన్సులు చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. విజిళ్లతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. డబ్బింగ్ మూవీ రీ-రిలీజ్‍కు ఇంత భారీ స్థాయిలో స్పందన రావటంతో తెలుగులో సూర్య క్రేజ్ మరోసారి రుజువైంది. థియేటర్లలో సూర్య అభిమానుల సంబరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ (తమిళంలో..v వారినమ్ అయిరామ్) 2008 నవంబర్ 14న విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయింది. తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించింది. ప్రేమ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్, హీరో ఒడిదొడుకులు, మంచి సందేశాల కలయికతో ఉన్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. హారిస్ జయరాజ్ సంగీతం ఈ మూవీకి మరో పెద్ద ప్లస్ పాయింట్. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఎవర్ గ్రీన్‍గా నిలిచిపోయాయి. హీరోయిన్ సమీరా రెడ్డి కూడా మాయ చేసింది. డ్యుయర్ రోల్‍లో సూర్య నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే, ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత థియేటర్లలో రిలీజ్ అయినా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తోంది.
సూర్య ప్రస్తుతం కంగువ చిత్రం చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్‍లో సూర్య కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘కంగువ’ గ్లింప్స్ ఆశ్చర్యపరిచింది. సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.