సూర్య యాక్షన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై బజ్.. ఆరోజే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుందా!-suriya romantic action movie retro will be streaming soon on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సూర్య యాక్షన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై బజ్.. ఆరోజే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుందా!

సూర్య యాక్షన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై బజ్.. ఆరోజే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుందా!

రెట్రో సినిమా ఓటీటీ రిలీజ్‍పై బజ్ నెలకొంది. సూర్య నటించిన ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

సూర్య యాక్షన్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై బజ్.. ఆరోజు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ!

తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రం చాలా అంచనాలతో వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు కావటంతో మరింత హైప్ ఏర్పడింది. ఈ రొమాంటిక్ యాక్ష్ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అయితే, ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లలో జోరు చూపించింది. ఈ రెట్రో సినిమా ఓటీటీ రిలీజ్‍పై తాజాగా బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై రూమర్లు బయటికి వచ్చేశాయి.

స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. జూన్ 5వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రెట్రో స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రెట్రో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. మే చివర్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందనే పుకార్లు కూడా ఇటీవల వచ్చాయి. అయితే, జూన్ 5న స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుందని తాజాగా బజ్ నడుస్తోంది. మరి ఆరోజున వస్తుందా.. ప్లాన్ ఏమైనా మారుతుందా అనేది చూడాలి.

మేకప్ లేకుండా పూజా హెగ్డే

రెట్రో సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీలో మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‍లో పూజా కనిపించారు. గడ్డంతో సూర్య గెటప్ కూడా మూసీగా ఉంది. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రోను తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. లవ్ స్టోరీ, గ్యాంగ్‍స్టర్ల పోరుతో ఈ మూవీ సాగుతుంది.

రెట్రో చిత్రంలో జోజూ జార్జ్, జయరాం, నాజర్, ప్రకాశ్ రాజ్, కరుణాకరన్, స్వసిక కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాగానే కలెక్షన్లు

రెట్రో చిత్రానికి మొదటి నుంచి మిశ్రమ స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు భారీగా దక్కలేదు. కానీ మరీ ప్లాఫ్ కాకుండా మంచి వసూళ్లే వచ్చాయి. రెట్రో చిత్రం సుమారు రూ.70కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటిందని మూవీ టీమ్ ప్రకటించింది. దీన్ని బట్టి ఈ చిత్రం హిట్ స్టేటస్ సాధించినట్టే.

రెట్రో సినిమాను 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ సుమారు నాలుగు నెలల్లోనే పూర్తయింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం