Retro Trailer: సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా రెట్రో (Retro). ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే సుమారు రెండు వారాల ముందుగానే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 18) చెన్నైలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
పిజ్జా అనే హారర్ మూవీతో వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెలుసు కదా. అతని డైరెక్షన్ లో తాజాగా వస్తున్న మూవీ రెట్రో. తమిళ స్టార్ హీరో సూర్య నటించాడు. పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. ఈ మూవీ మే 1న రిలీజ్ కానుండగా.. ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులోనూ రిలీజ్ కానుండగా.. ఇప్పుడు ట్రైలర్ ను కూడా తెలుగులో తీసుకొచ్చారు.
రెట్రో లుక్ లో సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్లో ట్రైలర్ కూడా చాలా ఫాస్ట్ గా, ఫుల్ యాక్షన్ తో సాగిపోయింది. చెన్నైలో శుక్రవారం (ఏప్రిల్ 18) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ రెట్రో మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
రెట్రో ట్రైలర్లో యాక్షన్ తోపాటు సూర్య, పూజ మధ్య లవ్ స్టోరీని కూడా బాగానే చూపించారు. ట్రైలర్ మొదట్లోనే సూర్య ఓ రెట్రో లుక్ లో ఎంట్రీ ఇస్తాడు. జింక బిర్యానీ సిద్ధమవుతుందని, ఆలోపు షో చేయాలని ఓ వ్యక్తి అతనితో అంటాడు. దీంతో అతడు తన బైక్ తీసుకొని షో చేస్తాడు. ఈ ట్రైలర్ ద్వారా మూవీ స్టోరీ ఏంటన్నది పెద్దగా రివీల్ కాలేదు. అయితే సూర్యది చాలా వయోలెంట్ రోల్ అని మాత్రం అర్థమవుతోంది.
లవ్, యాక్షన్, వయోలెన్స్ కలగలసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇదొక రొమాంటిక్ యాక్షన్ మూవీ. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ స్టూడియోస్ నిర్మించాయి. సూర్య, పూజా హెగ్డేతోపాటు జోజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్, కరుణాకరణ్ లాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. ఇక రెండు గంటల 48 నిమిషాల భారీ రన్ టైమ్ తో సినిమా వస్తోంది. మే 1న థియేటర్లలో రెట్రో మూవీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం